యువ సామ్రాట్ అక్కినేని నాగార్జునకు శివ సినిమా తర్వాత ఎక్కవ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిన విషయం తెలిసిందే. అతడికి అమ్మాయిల ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. మన్మథుడుతో అమ్మాయిల గుండెల్లో ఓ రొమాంటిక్ హీరో అయిపోయాడు. ఆ సినిమాతో క్లాస్ సినిమా, రొమాంటిక్ సినిమాలో నాగార్జునకు ఎదురులేదని నిరూపించుకున్నాడు. నాగార్జున మొదట డి. రామానాయుడు కూతురు శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్నాడు.

ఆమెతో విడాకులు తీసుకున్న అనంతరం నాగార్జున అమలను పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ఓ హీరోయిన్ ను తన కుమారుడిని పెళ్లి చేసుకోమని ప్రపోజల్ పెట్టేవాడట. ఆమె ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన సుమలత. సినిమా షూటింగ్ లో సరదాగా ఆమెను ఓ రోజు అడిగాడట.

ఏమ్మా.. సుమలత.. నీ కోసం ఓ అబ్బాయిని చూశాను.. పెళ్లి చేసుకుంటావా… అతడు అమెరికాలో చదువుకున్నాడు.. అందంగా ఉంటాడు అని చెప్పాడట. అయితే దానికి సుమలత ఆత్రుతగా ఎవరు సార్.. అంటూ అడగ్గా.. ఎవరో కాదు.. మా అబ్బాయి.. నాగార్జున అని చెప్పాడట.

దీంతో ఆమె సిగ్గుతో మెలికలు తిరుగుతూ అక్కడ నుంచి వెళ్లిపోయేదట. ఆ తర్వాత ప్రతీ ఒక్కరూ ఈ విషయం గురించే మాట్లాడుకునే వారట. అప్పట్లో ఇదొక సంచలనంగా మారిందని సమలత ఎన్నో సార్లు చెప్పింది. ఇలా నాగార్జునకు పెళ్లి కాకముందే ఏఎన్నార్ ఓ సంబంధం చూశాడని .. సోషల్ మీడియాలో ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.































