Nagababu: నాగబాబు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ అలాగే సంచలనమైనటువంటి పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే ఏపీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన అనంతరం ఈయన సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ సంచలనగా మారింది.

మే 13వ తేదీ ఏపీలో జరిగినటువంటి ఎన్నికలలో భాగంగా మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూనే మరోవైపు వైసీపీ అభ్యర్థికి ప్రచార కార్యక్రమాలు చేశారు.
ఈ విషయంపై మెగా అభిమానులు అలాగే బన్నీ అభిమానుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కానీ బన్నీ మాత్రం ఈ ట్రోల్స్ పై స్పందిస్తూ నాకు పార్టీలతో సంబంధం లేదు స్నేహం కోసం ఎక్కడికైనా వెళ్తా అంటూ క్లారిటీ ఇచ్చారు కానీ తాజాగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ మాత్రం పరోక్షంగా బన్నీని ఉద్దేశించి చేశారు అంటూ సోషల్ మీడియాలో బన్నీ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.
అల్లు అర్జున్ గురించేనా..
ట్విట్టర్ వేదికగా నాగబాబు స్పందిస్తూ.. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడు అయినా సరే పరాయి వాడే… మాతో నిలబడే వాడు పరాయివాడైన మా వాడే అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి నాగబాబు అల్లు అర్జున్ ఉద్దేశించే ఈ పోస్ట్ చేశారా అంటూ కొందరు కామెంట్లు చేస్తూ నాగబాబు పై విమర్శలు చేయగా మరికొందరు వర్మని ఉద్దేశించి చేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.



























