Komati Reddy Venkata Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కాంగ్రెస్ నేతలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి పట్టం కట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు వెళ్లి వెల్లు వెత్తుతున్నాయి ఇలాంటి తరుణంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

ఇందులో భాగంగా ముందుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకూడదని రాష్ట్రంలో సుపరిపాలన అందించాలని కోరారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సోనియా గాంధీకి బహుమానంగా అందజేస్తున్నామని తెలిపారు. ప్రజల అభివృద్ధి రాష్ట్రం విజయపతంలో నడవడం కేవలం ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమవుతుందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఎంతో కృషి చేసినటువంటి నా సోదరుడు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు అంటూ తెలియచేశారు. ఇక ఈ లేఖలో భాగంగా గత పది సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ప్రజల సంక్షేమం పక్కన పెట్టి ప్రజలకు అన్యాయం చేశారు. అవన్నీ ప్రజలు గుర్తుంచుకున్నారు. అందుకే చరిత్రాత్మక తీర్పునిచ్చి, కాంగ్రెస్కు అధికారం ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీలో సీఎం క్యాండిడేటే లేరని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేశాయి.
కాంగ్రెస్ విజయం సోనియాకు బహుమానం…
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించడం ఎంతో హర్షించదగ్గ విషయం అంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం పట్ల వెంకటరెడ్డి తెలియచేస్తూ ఈ సందర్భంగా బహిరంగ లేక తెలియజేశారు. అలాగే ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి పరిపాలన కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కోరారు.


































