Namitha: సినీ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నమిత ఒకరు. ఈమె సూరత్ కి చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఇక తెలుగులో కంటే తమిళంలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన నమిత ఎంతోమంది తమిళ అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా ఒకానొక సమయంలో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమెకు అనంతరం అవకాశాలు క్రమక్రమంగా తగ్గిపోయాయి ఇలా అవకాశాలు తగ్గిపోవడంతో బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేశారు. ఇలా తన వృత్తి పరమైన జీవితంలో కొనసాగుతున్నటువంటి ఈమె అనంతరం వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.
ఇక ఈమె కవల మగ పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నమిత తన ప్రెగ్నెన్సీ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి 2001వ సంవత్సరంలోనే తాను ప్రెగ్నెంట్ అయ్యానని తెలిపారు నాలుగు నెలల తర్వాత తనకు అబార్షన్ కావడంతో చాలా బాధపడ్డానని డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని ఈమె తెలిపారు.
అబార్షన్ అయింది..
ఇక మరోసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత మూడు నెలలకే తనకు ట్విన్స్ ఉన్నారని డాక్టర్లు చెప్పారు అప్పటి నుంచి మా ఆయన నాకు చాలా కండిషన్లు పెట్టారు. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు కానీ ఏడు నెలల వరకు నాకు కనీసం పొట్ట కూడా కనిపించకపోవడంతో చాలా టెన్షన్ పడ్డానని ఏడు నెలల తర్వాత పొట్ట పెరగడంతో కాస్త మనశ్శాంతిగా అనిపించింది అంటూ తన ప్రెగ్నెన్సీ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అలాగే తన కవల పిల్లల గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























