Namrata: నమ్రత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యగా మాత్రమే కాకుండా బిజినెస్ ఉమెన్ గా కూడా ఎంతో మంచి పేరు పొందారు. ఈమె ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు అయితే మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమై కేవలం కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ బిజీగా గడుపుతున్నారు.

ఇక ఈ మధ్యకాలంలో ఈమె బిజినెస్ రంగంలోకి కూడా అడుగు పెట్టారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నమ్రత తన గురించి తన భర్త పిల్లల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.మహేష్ బాబుతో పెళ్లి జరిగిన తర్వాత తన ప్రపంచమే మారిపోయిందని అందుకే తాను సినిమాలకు దూరంగా ఉండి ఒక భార్యగా అమ్మగా పూర్తిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని తెలియజేశారు.
ఇక మహేష్ బాబుతో పెళ్లి జరిగినటువంటి సందర్భం నా జీవితంలో బెస్ట్ మూమెంట్ అంటూ నమ్రత ఈ సందర్భంగా తెలియజేశారు.ఇక మీకు మహేష్ బాబుకు ఏవైనా గొడవలు వస్తాయా అంటూ ప్రశ్నించగా మా ఇద్దరి మధ్య పిల్లల వల్ల గొడవలు తలెత్తుతాయని ఈమె తెలియజేశారు. పిల్లలు నన్ను ఏదైనా అడిగితే అది మంచిది కాకపోతే నో అని చెబుతాను.

Namrata: పిల్లలు ఏది అడిగినా మహేష్ నో చెప్పరు…
అందుకే పిల్లలు ఎప్పుడూ ఏదీ నన్ను అడగరని మహేష్ ని అడుగుతారని మహేష్ వారు ఏది అడిగినా నో అని సమాధానం చెప్పరని నమ్రత తెలిపారు. ఇలా పిల్లల వల్ల మా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయని ఈమె తెలియజేశారు.చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేయడంతో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.






























