Namrata: సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి తెలియని వారంటూ ఉండరు. 1993లో మిస్ ఇండియాగా ఎంపికైన నమ్రత ఆ తర్వాత పలు వానిజ్య ప్రకటనలలో నటించింది. ఆ తర్వాత సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ఈ క్రమంలో మహేష్ బాబుతో ప్రేమలో పడి కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకుంది. వివాహం తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా దూరం అయింది. భార్యగా, తల్లిగా తన బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచింది. నమ్రత కేవలం కుటుంబానికి సంబంధించిన విషయాలను చూసుకోవడమే కాకుండా మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు మహేష్ బాబు వ్యాపారాలు సంబందించిన విషయాలను కూడా నమ్రత చూసుకుంటుంది.
ఇలా ఇల్లాలిగా మాత్రమే కాకుండా మహిళా వ్యాపారవేత్తగా కూడా అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నమ్రత మహేష్ బాబు సినిమా విశేషాలతో పాటు కుటుంబానికి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునేది. ఇటీవల కొడుకు గౌతమ్ ఒంటరిగా విదేశాలకు వెళ్లడంతో నమ్రత ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

Namrata:తండ్రిని తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేసిన నమ్రత..
ఇక తాజాగా తన తండ్రి నితిన్ శిరోద్కర్ ని తలచుకొని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ లో
“గత 16 సంవత్సరాలుగా నిన్ను మిస్ అవుతూనే ఉన్నాను పప్పా… నీతో గడిపిన ప్రతి జ్ఞాపకం ఇప్పటికీ నా మదిలో పదిలంగా ఉండిపోయాయి. ఇప్పటికీ ఏమీ మారలేదు. నువ్వు మమ్మల్ని వదిలి చాలా త్వరగా వెళ్ళిపోయావు పప్పా.. అనంతమైన నా ప్రేమను వెలుగులను ఎప్పటికీ నీకు పంపుతూనే ఉంటాను ” అంటూ తన తండ్రిని తలచుకొని నమ్రత ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.






























