Namrata: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. ఇక మహేష్ బాబు బాలీవుడ్ నటి నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉండటమే కాకుండా ఎందరికో ఆదర్శంగా కూడా నిలిచారు.

ఇక మహేష్ బాబు నమ్రత ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు అయితే మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదని ఇటీవల నమ్రత తమ లవ్ సీక్రెట్ బయటపెట్టారు. మహేష్ తాను కలిసి వంశీ సినిమాలో నటించాము. ఈ సినిమా సమయంలో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యామని అయితే ఫ్రెండ్స్ అయిన తర్వాత మహేష్ బాబు మనస్తత్వం ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అనే విషయాలను తెలుసుకున్నాను ఇక మహేష్ కూడా నా గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మేమిద్దరం ప్రేమలో పడ్డామని తెలిపారు.
ఇలా స్నేహం తర్వాతే మా ప్రేమ మొదలైందని ఇక పెళ్లి అనేది వెంటనే మేము తీసుకున్న నిర్ణయం కాదని ప్రేమలో కొద్ది రోజులు ఎంజాయ్ చేసిన తర్వాతే పెళ్లి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక ప్రస్తుతం మహేష్ నా పక్కన ఉంటే చాలు నాకు మరో ప్రపంచంతో అవసరం లేదు. మా ఇద్దరి మధ్యలో స్నేహం తర్వాతే మా ప్రేమ మొదలైందని ఇక పెళ్లి అనేది వెంటనే మేము తీసుకున్న నిర్ణయం కాదని ప్రేమలో కొద్ది రోజులు ఎంజాయ్ చేసిన తర్వాతే పెళ్లి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
తను నా పక్కన ఉంటే చాలు..
ఇక ప్రస్తుతం మహేష్ నా పక్కన ఉంటే చాలు. అలా ఇద్దరం ఏకాంతంగా ఎన్ని రోజులైనా ఉండిపోతామని మాకు ఈ లోకంతో పని లేదంటూ ఈ సందర్భంగా మహేష్ పై తనకున్న ప్రేమను అలాగే తన ప్రేమ విషయాలను నమ్రత తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.



























