శాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ ఆకస్మిక మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటుగా ఏర్పడింది. అప్పటి వరకు ఎంతో ఆనందంగా నవ్వుతూ ఎంతో చురుకుగా ఉన్న పునీత్ అకాల మరణం అందరినీ ఎంతో షాక్ కి గురి చేసింది. బాల నటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఉత్తమ బాలనటుడిగా నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న పునీత్ ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అప్పు అనే సినిమా ద్వారా వెండి తెరకు హీరోగా పరిచయం అయ్యారు.

ఇలా హీరోగా అడుగుపెట్టిన పునీత్ తనదైన శైలిలో సినిమాలలో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మనసులలో రియల్ హీరోగా పేరు సంపాదించుకున్న పవర్ స్టార్ పునీత్ ఇకలేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం
కంఠీరవ స్టేడియంలో ఉంచారు.
నందమూరి బాలకృష్ణ కంఠీరవ స్టేడియం చేరుకొని తన మిత్రుడికి ఆఖరి చూపులు చూశారు. ఈ క్రమంలోనే కంఠీరవ స్టేడియం స్టేడియంకు చేరుకున్న బాలకృష్ణ ముందుగా పునీత్ సోదరుడు శివ రాజ్ కుమార్ ని కలిసి ఎంతో బావోద్వేగమయ్యారు. అనంతరం పునీత్ భౌతికకాయాన్ని చూసి బాలకృష్ణ కన్నీటిపర్యంతమయ్యారు.
His bonding with #NBK has always been special ❤#PuneethRajkumar #NandamuriBalakrishna pic.twitter.com/7T6CQkApit
— Pulagam Chinnarayana (@PulagamOfficial) October 29, 2021
పునీత్ కన్నడ నటుడు అయినప్పటికీ బాలకృష్ణకు మధ్య మంచి స్నేహ బంధం ఉందని చెప్పవచ్చు. ఒకసారి కర్ణాటక లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ హాజరయ్యారు. ఈ క్రమంలోనే పునీత్ బాలకృష్ణ పట్ల చూపిన ఆదరాభిమానాలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇందులో బాలకృష్ణ మొహానికి ఏదో అంటుకొని ఉండగా పునీత్ ఎంతో ఆప్యాయంగా బాలకృష్ణతో మెలగడం ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.































