Nandhamuri Balakrishna : నందమూరి బిడ్డగా సినిమాల్లోకి అడుగుపెట్టిన తారక రత్న మొదటి సారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినపుడే ఒకేసారి తొమ్మిది సినిమాలను సైన్ చేసి రికార్డు క్రియేట్ చేయాడు. ఇక మొదటి సినిమా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో మంచి గుర్తింపే తెచ్చుకున్న ఆతరువాత కెరీర్ లో తడబడ్డాడు. ఇక విలన్ గాను రవిబాబు సినిమాలో నటించిన తారక రత్న మంచి మార్కులే తెచ్చుకున్నా అది కొంసాగించలేదు. ఇక రాజకీయాల వైపు ప్రస్తుతం అడుగుపెట్టి టీడీపీ తరుపున స్పీచ్ లతో ఆధరగొడుతున్న ఆయన లోకేష్ పాదయాత్రలో గుండె నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. ప్రస్తుతం బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స అందుకుంటున్న తారకరత్నను బాబాయ్ బాలకృష్ణ అన్నీ తానై చూసుకుంటున్నాడు. మరణానికి తారక రత్నకి మధ్య నేనున్నాను అంటూ తారక్ రత్నను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు.

బాలయ్య నువ్వు సూపర్…
తారకరత్న గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోవడంతో అక్కడే ఉన్న కెసి హాస్పిటల్ కు వెంటనే బాలకృష్ణ తీసుకెళ్లారు. ఆ పైన మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించడంతో పనులన్నీ పక్కన పెట్టి బాలయ్య కొడుకు తారకరత్న కోసం అక్కడే హాస్పిటల్ లోనే ఉంటూ తనని చూసుకున్నాడు. బాలయ్య మాట్లాడితే వివాదాలే, సినిమాల్లో మాత్రమే బాలయ్య నటిస్తాడు. ఆయనకు పేద, ధనిక బేధాలు ఉండవు.

ఎవరితోనైనా ఒకేలాగా మాట్లాడే బాలయ్య అక్కినేని తొక్కినేని అన్న కామెంట్స్ కి నెగెటివ్ ట్రోల్ ఎదుర్కొన్నా అందరూ క్షమాపణ చెబుతాడనుకుంటే బాలయ్య మా బాబాయ్ ని నేనెందుకు తక్కువ చేసి మాట్లాడుతాను అంటూ ఒక్క మాటతో వివాదానికి ముగింపు పలికాడు. అయితే బాలయ్య మాట కటువు కానీ మనసు వెన్న అని తారక రత్న విషయంలో నిరూపించుకున్నాడు. తారకరత్న ను హాస్పిటల్ లో చూసుకున్న తీరు అభిమానులకే కాదు నెటిజెన్స్ ని కూడా ఫిదా చేసింది. అందుకే బాలయ్య నిజంగానే ఫిల్టర్ లేని ఎమోషన్ అంటూ కామెంట్స్ చేస్తన్నారు.































