Nani: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నాని తాజాగా దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఏకంగా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది. నాని సినీ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా దసరా సినిమా నిలిచింది.

ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నాని తన తదుపరి సినిమాలకు రెమ్యూనరేషన్ విషయంలో భారీగా డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. సాధారణంగా ఒక సినిమా మంచి హిట్ అయితే ఆ హీరోకి మార్కెట్ కూడా పెరుగుతుంది. ఈ క్రమంలోనే రెమ్యూనరేషన్ కూడా పెంచుతూ ఉంటారు. అయితే నాని పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈయన రెమ్యూనరేషన్ పెంచారని తెలుస్తుంది.
ప్రస్తుతం నాని నటించిన దసరా సినిమాకు ఏకంగా 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన అదనంగా మరో రెండు కోట్లు రెమ్యూనరేషన్ పెంచి తన తదుపరి సినిమాలకు 22 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇక నిర్మాతలు కూడా నాని అడిగిన మొత్తం రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు.

Nani: రెమ్యూనరేషన్ పెంచిన నాని…
నానితో సినిమా చేస్తే నష్టాలు రావు నాని సినిమా మినిమం హిట్ గ్యారెంటీ అన్న నమ్మకం నిర్మాతలలో ఉంది అందుకే ఈయన డిమాండ్ చేస్తున్నటువంటి రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు ఏమాత్రం ఆలోచించడం లేదు.ఇక దసరా సినిమా మంచి సక్సెస్ కావడంతో నానికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈయన వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తూ సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇక నాని తన తదుపరి చిత్రాన్ని వివేక్ ఆత్రేయ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో చేస్తున్నారు.































