Nani: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా ఎన్నికల హడావిడి నెలకొంది రెండు రాష్ట్రాలలోనూ ఎన్నికల ఒకేసారి జరగబోతున్నటువంటి నేపథ్యంలో విజయం ఎవరిది అనే విషయంపై చర్చలు మొదలయ్యాయి అయితే జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికలలో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసినటువంటి ఈయన ఘోరంగా ఓటమి పాలు అయ్యారు అయితే ఈసారి మాత్రం ఎలాగైనా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అనే ఉద్దేశంతో కాపులు అధికంగా ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఈయనకు భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది.
ఇప్పటికే మెగా హీరోలు అందరూ కూడా పిఠాపురం చేరుకొని ప్రచార కార్యక్రమాలు చేసిన సంగతి తెలిసిందే అలాగే చిరంజీవి రామ్ చరణ్ వంటి వారందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఈయన గురించి మాట్లాడుతూ తనకు మద్దతు తెలుపుతున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీ నుంచి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది పలువురు దర్శకులు నిర్మాతలు కూడా ఈయనను గెలిపించాలని కోరుతున్నారు.
లక్ష్యం నెరవేరాలి..
ఈ క్రమంలోనే నటుడు నాచురల్ స్టార్ నాని సైతం సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గెలుపును ఆకాంక్షిస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.సినిమా ఫ్యామిలీకి చెందిన పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం నెరవేరాలి. ఆయన ఎన్నికల్లో విజయం సాధించాలి. నాతో పాటు మన చిత్ర పరిశ్రమ కూడా ఇదే కోరుకుంటుందని భావిస్తున్నాను… అని నాని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.





























