గత కొంత కాలంగా నానీ హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ ఓటీటీలో విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. తర్వాత అలాంటిది ఏమీ లేదని చిత్ర యూనిట్ సభ్యులు కొట్టి పడేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాని నటించిన టక్ జగదీష్ సినిమా చకచకా షూటింగ్ జరిపేసుకుంది. సింగిల్ బయ్యర్ లక్ష్మణ్ ప్రొడెక్ట్ ను కొనుగోలు చేసుకున్నారు. అంతా బాగానే వుంది. కానీ కరోనా వచ్చి పడింది. దాంతో విడుదల ఆగిపోయింది.

ఇప్పుడు విడుదల చేద్దాం అంటే ఆంధ్రలో టికెట్ రేట్లు లేవు. బయ్యర్లు గతంలో ఇచ్చిన కమిట్ మెంట్ ను కాదంటున్నారు. పోనీ ఓటిటికి ఇద్దామా అంటే హీరో నానికి ఇష్టం లేదు. కొనుక్కున్న లక్ష్మణ్ కు ఇష్టం లేదు.
ఇప్పటికే ‘వి’ సినిమాను ఓటిటికి ఇచ్చి నాని దెబ్బతిన్నారు. మళ్లీ వెంటనే మరో సినిమా ఓటిటికి ఇవ్వడం హీరోకి ఇష్టం లేదు.
అలాగే దిల్ రాజు దగ్గర నుంచి వేరు పడిన తరువాత బయ్యర్ లక్ష్మన్ కు రెండు రాష్ట్రాల్లో విడుదల చేసే తొలిసినిమా ఇది. అందువల్ల ఆయనకు కూడా ఓటిటికి ఇవ్వడం అంత ఇష్టం లేదు . అయితే ఇప్పటికే దీనికి అమెజాన్ ప్రైమ్ రూ.37 కోట్లు ఆఫర్ ఇవ్వడంతో మేకర్స్ ఓటీటీలో విడుదల చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం.
ఇంకా ఈ సినిమాకు శాటిలైట్ హక్కులకు స్టార్ రూ.8 కోట్లకు.. హిందీ డబ్బింగ్ కు రూ. 5 కోట్లు.. ఆడియో రైట్స్ ను ఆదిత్యా మ్యూజిక్ రూ. 2కోట్లకు దక్కించుకుంది. మొత్తంగా రూ.52 కోట్లు ఈ సినిమాకి వస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి థమన్ సంగీతం వహిస్తుండగా రీతు వర్మ హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే.
































