AP politics: ఏపీ 2024 ఎన్నికల ఫలితాలలో కూటమి అఖండమైన విజయం సాధించిన 164 స్థానాలలో విజయం సాధించి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. తెలుగుదేశం పార్టీతో పాటు బిజెపి జనసేన మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని మరి ఎన్నికల బరిలో దిగి అఖండమైన విజయం సాధించాయి.

ఇక జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు రాగా నేడు విజయవాడలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అతిరథ మహారథుల సమక్షంలో అలాగే ఎంతో మంది అభిమానులు కార్యకర్తల సమక్షంలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఇక గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు నాయుడు చేత పదవి ప్రమాణ స్వీకారం చేయించారు.
చంద్రబాబు నాయుడు అనే నేను..
ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు అలాగే సినీ నటులు రజనీకాంత్ చిరంజీవి వంటి వారు కూడా ప్రత్యేక అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన తర్వాత రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడంతో కార్యకర్తలు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.





























