Naresh – Pavithra Lokesh : రోజు రోజు కు కొత్త ట్విస్టలతో వైరల్ అవుతోంది నరేష్-పవిత్ర లోకేష్ ఇష్యూ. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. నిన్న ఏకంగా నరేష్ మూడవ భార్య అయిన రమ్య, నరేష్ పవిత్ర లొకేష్ లను మైసూర్ లో ఒక హోటల్ లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. రమ్య అక్కడికి వెళ్లి ఏకంగా నరేష్ పవిత్ర లోకేష్ లకు చెప్పు చూపిస్తూ రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పుడే రాకేష్ అనే వ్యక్తి కూడా నరేష్ పవిత్ర వెళ్తున్న కారుని ఆపడానికి ప్రయత్నం చేయడం, అంతలో నరేష్ కూడా విసిల్స్ వేస్తూ రమ్యకు, రాకేష్ కు అక్రమ సంబంధం ఉందని అరుస్తూ కారులో వెళ్లిపోవడం తెలిసిందే. అయితే ఇపుడు అందరు అసలు రాకేష్ శెట్టి ఎవరు అని ఆసక్తి కనబరుస్తున్నారు.

అసలు కొత్తగా వినిపిస్తున్న ఈ రాకేష్ శెట్టి ఎవరు…
నరేష్, పవిత్ర లోకేష్ ఇష్యూ లో ఇపుడు కొత్తగా తెర మీదకు వచ్చిన పేరు రాకేష్. అసలు ఈ రాకేష్ శెట్టి ఎవరు, రమ్య కు రాకేష్ కు మధ్య వున్న రిలేషన్ ఏంటి అని అందరూ ఆరాలు తీస్తున్నారు. రాకేష్ శెట్టి కర్ణాటక కు చెందిన వ్యక్తి. ఈయనకు కర్ణాటకలోని పలు చానెల్స్ తో సంబంధాలు వున్నాయి. అంతే కాకుండా రాకేష్ శెట్టికి సొంతంగా ఒక న్యూస్ చానల్ వుంది. ఈయన పవర్ న్యూస్ చానల్ మేనేజంగ్ డైరెక్టర్.

అయితే ఈ న్యూస్ చానల్ ఆధారంగానే రమ్య తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది అని నరేష్ చెప్తున్నారు. అంతే కాకుండా రమ్య ఇంకా కొన్ని న్యూస్ చానెల్స్ ని కొని మాపై బురద జల్లుతోంది అని నరేష్ వాదన. ఇది ఇలా ఉండగా రమ్య రఘుపతి, రాకేష్ శెట్టి ల మధ్య రిలేషన్ గురించి ఇంకా క్లారిటీ లేదు. రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతున్న ఈ వివాదం ఎక్కడికి చేరుతుందో చూడాలి.































