బిగ్ బాస్ సీజన్ 5 రియాల్టీ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేకపోతున్నాం. ఒకరోజు ఒకరిపై ఒకరు యుద్దం ప్రకటించుకుంటూ అనకూడని మాటలతో అరుచుకుంటారు. మరొక రోజు ప్రేమ కురిపించుకుంటారు. ఎట్టకేలకు కెప్టెన్సీ టాస్క్, ప్రమేకథలతో గురువారం సరదాగా బిగ్ బాస్ సాగిపోయింది. అయితే శుక్రవారం ఎపిసోడ్ కు సంబంధించి మొదటి ప్రోమోలు మళ్లీ ఒకరిపై ఒకరు భగ్గుమన్నారు. ఎప్పటిలాగే హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో వరెస్ట్ మరియు బెస్ట్ పెర్‌ఫార్మర్ ఎవరు అంటూ చిచ్చు పెట్టేశాడు.

ఇలా సాఫీగా సాగిపోతుండగా.. ఇలా బిగ్ బాస్ ట్విస్ట్ లు ఇచ్చుకుంటూ వారి మధ్య దూరాన్ని పెంచేస్తున్నాడు. ఎవరిపై వరెస్ట్ అని చెబితే ఎక్కడ ఎవరు ఫీల్ అవుతారో అని హౌస్ మేట్స్ భయపడిపోతున్నారు. ఈ సందర్భంగా నటరాజ్ తన మాటలతో శివతాండవం చేశారు. బెస్ట్ నాలెడ్జ్, సెన్స్ ఉండదు.. ఎలా ఆడాలి అంటూ కోపంతో ఊగిపోతాడు.

అతడు ఎవరి గురించి అన్నాడో తెలియదు కానీ.. రెండో ప్రోమో బిగ్ బాస్ విడుదల చేసి నటరాజ్ మాస్టర్ కు కన్నీళ్లు పెట్టించాడు. రెండో ప్రోమో చంటి పిల్లాడు ఏడ్చే శబ్దం వస్తుంది. అందరూ ఎవరు అంటూ.. ఒకరి మోహం ఒకరు చూసుకుంటారు. నటరాజ్ కు అప్పుడే అర్థం అయిపోతుంది.. అది తన గురించే అని.. తన కళ్ల వెంట నీళ్లు కారిపోతుండగా.. ప్రియాంక సింగ్ వచ్చి ఓదార్చుతుంది. తర్వాత సోఫాలో అందరూ కూర్చున్న తర్వాత ఆ బిగ్ స్క్రీన్ పై తన భార్య సీమంతంకు సంబంధించి వీడియో కనిపిస్తుంది.
దీంతో కాసేపు నటరాజ్ మాస్టార్ భావోద్వేగానికి గురవుతాడు. ‘‘నైట్ నువ్వు మాట్లాడితే బేబీ కదిలేది కదా.. ఇప్పుడు బిగ్ బాస్ లో నీ మాటలు వింటూ బేబీ డిష్యూం డిష్యూం అంటూ ఫైట్ చేస్తుంది’’ అంటూ చెప్పగానే నటరాజ్ మాస్టార్ వెళ్లి బిగ్ స్క్రీన్ పై ఉన్న తన భార్య ఫొటోకు ముద్దు పెట్టేస్తాడు.




























