Nathicharami Sandhesh : సినిమా ఇండస్ట్రీ లో ఆర్ నారాయణ మూర్తి గారు అన్నా ఆయన సినిమాలన్నా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన సినిమాల్లో విప్లవ భావాలతో పాటు బలహీన వర్గాలకు జరిగే అన్యాయాలను చూపిస్తారు. ఇక అలాంటి నారాయణ మూర్తి గారి సినిమా ‘ఊరు మనదిరా’ సినిమాతో గుర్తింపు తెచ్చికున్న నటుడు సందేశ్ బూరి నారాయణ మూర్తి గారితో పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. సందేశ్ బూరి గారి తొలిచిత్రం ‘ఎల్లమ్మ’, షేక్స్ పియర్ నవల ఆధారంగా తెలంగాణ నేటివిటీ కి తగ్గట్టు తీసిన సినిమాలో సందేశ్ గారు మొదట నటించారు. మొదటి సినిమాలోనే నాజర్, రేవతి సోనాలి కులకర్ణి వంటి మంచి నటులతో నటించే అవకాశాన్ని అందుకున్నారు.

నారాయణ మూర్తి గారి కోపానికి సినిమా మానేద్దాం అనుకున్నా…
ఇక ఎల్లమ్మ సినిమా తరువాత రోడ్డు మీద వెళుతుంటే ఆర్ నారాయణ మూర్తి గారు చూసి ఊరు మనదిరా సినిమా ఆఫర్ ఇచ్చారు. అయితే బయట ఆర్ నారాయణ మూర్తి గారు షూటింగ్ లొకేషన్ లో నారాయణ మూర్తి గారు చాలా వేరుగా ఉంటారు. సన్నివేశం సరిగా రాలేదంటే ఆర్టిస్టు మీద కోప్పడుతారు. ఆయన సెట్స్ లో అన్ని విషయాలు చూసుకుంటూ ఉంటారు. అలాంటపుడు కోపం సహజమే నా మీద కూడా అలానే అరిచేసారు. ఒక్కసారిగా చాలా బాధ, భయం వేసాయి. సినిమా చేయడం మానేద్దాం అనుకున్నా కానీ ఆయనే మళ్ళీ సారీ బ్రదర్ అంటూ మాట్లాడి ఇలా చేయి అంటూ సలహాలు ఇస్తారు. అయితే ఆయనతో నటించినవారి ఇంటర్వ్యూ లు చూసాక కొన్ని రోజులు ఆయన పని తీరు చూసాక ఆయన కోపం అర్థమైంది అంటూ చెప్పారు.

సందేశ్ గారు పలు సీరియల్స్ లో కూడా నటించారు. అయితే ఆయనకు ఊరు మనదిరా సినిమాతో పాటు నాతిచరామి, ప్రభంజనం, మిస్టర్ గిరీషం సినిమాలు మంచి పేరును తెచ్చాయి. ఇక సినిమా అవకాశాల గురించి మాట్లాడుతూ హీరోలు, డైరెక్టర్లకు బాగా తెలిసిన ఆర్టిస్టులకు అవకాశాలు రావడం ఇండస్ట్రీ లో మామూలే. వారి సౌలభ్యాన్ని బట్టి పాత్రల ఎంపిక ఉంటుంది. దాంట్లో తప్పేమి లేదు, దాన్ని దాటి ఆ నటుడు అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలడని భావిస్తే అది ఒక ఆర్టిస్ట్ కి అచీవ్మెంట్ అంటూ అభిప్రాయపడ్డారు సందేశ్.



































