Natti Kumar : ఏపీ రాజకీయం అంతా మూడు రాజధానులు మూడు పెళ్లిళ్లు అంటూ సాగుతోంది. వైసీపీ పాలనలో మూడు రాజధానుల గురించి ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తుంటే జగన్ సర్కార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి కామెంట్స్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూ గురించి స్పందిస్తూ పరుశంగా మాట్లాడారు. ఇక మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఎవరికీ అన్యాయం చేయలేదు అంటూ చెప్పాడు. ఈ అంశం మీద ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడిన తీరును తప్పుబట్టారు, నోటీసులు ఇచ్చారు. నిజంగానే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో లీగల్ గా సమస్యలను ఎదుర్కొంటారా అనే అంశం మీద సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ మాట్లాడారు.

నోటీసులు ముందు వారికి ఇవ్వాలి మహిళా కమిషన్…
పవన్ కళ్యాణ్ మహిళలను కించపరిచాడు అంటూ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఇక ఈ విషయం గురించి నట్టికుమార్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆయన మూడు పెళ్లిళ్ల గురించి ముందు మాట్లాడిన వారికి నోటీసులు ఇవ్వాలి మహిళా కమిషన్. ఇంకొకరి వ్యక్తిగత జీవితం గురించి, మహిళల గురించి మాట్లాడినందుకు వారికి నోటీసులు ఇవ్వాలి.

పవన్ వారి విమర్శలకు సమాధానం చెప్పాలి కాబట్టి మాట్లాడారు కానీ అంతకుముందు ఏ నాడూ మహిళలను కించపరిచేలా మాట్లాడలేదు కదా. అదీకాక పవన్ మాజీ భార్యలు ఎవరైనా మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసి ఉంటే పవన్ మీద యాక్షన్ తీసుకోవాలి కానీ రాజకీయాల కోసం వ్యక్తిగత విషయాలను వాడుకోరాదు అంటూ నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు.
































