Navapur Railway Station : రెండు రాష్ట్రాలు కానీ ఒక రైల్వేస్టేషన్ రెండింటినీ కలిపింది. అదే మహారాష్ట్ర గుజరాత్ రెండు రాష్ట్రాలు పంచుకునే రైల్వేస్టేషన్. పశ్చిమ రైల్వేలలో ప్రముఖ్యతను సంతరించుకున్న ఈ రైల్వే స్టేషన్ మహారాష్ట్ర లో కొంత బాగం, గుజరాత్ లో కొంత భాగం ఉండటమే విశేషం. సరిహద్దు విభజన రేఖ సరిగ్గా ఒక బెంచ్ మధ్యలో వెళ్లడం మరీ ప్రత్యేకం. ఒక బెంచ్ సగ భాగం మహారాష్ట్రలో ఉండగా సగం గుజరాత్ లో ఉంటుంది. మహారాష్ట్ర వైపు బెంచ్ మీద కూర్చొని మందు తాగొచ్చు కాని గుజరాత్ వైపు అలాంటివి చేయకూడదు అనుమతి లేదు. అలాగే మహారాష్ట్ర వైపు గుట్కా, పాన్ లాంటివి తినకూడదు అనుమతి లేదు. ఇలా రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ రైల్వే స్టేషన్ బాగా ఫేమస్ అయింది.

స్టేషన్ మాస్టర్ ఒక రాష్ట్రంలో… టికెట్స్ ఇచ్చేది మరో రాష్ట్రంలో…
బ్రిటిష్ కాలం నాటి ఈ రైల్వే స్టేషన్ బాంబే ప్రొవిన్స్ లో భాగంగా ఉండేది. అయితే మారిన పరిస్థితుల కారణంగా మహరాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలుగా విడిపోయాక నవాపూర్ రైల్వే స్టేషన్ రెండు రాష్ట్రాల పరిధిలోకి వచ్చింది. ఈ రైల్వేస్టేషన్ గుజరాత్ వైపు నుంచి 800 మీటర్ల పొడవు, 500 మీడర్ల వెడల్పు ఉంది. మహారాష్ట్ర వైపు 300 మీటర్ల పొడవు ఉంది. ఈ స్టేషన్‌లో నాలుగు భాషల్లో అనౌన్స్‌మెంట్ ఇస్తారు. అవి ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాత్.

ఇక మరో విశేషం ఏంటంటే ఈ స్టేషన్ లో మహారాష్ట్రలోని నందర్బర్ జిల్లాలో ఉన్న భాగం వైపు వెళ్లి టికెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అలాగే, స్టేషన్ మాస్టర్ ఆఫీస్, వెయిటింగ్ రూమ్, వాష్‌రూమ్స్ అన్ని గుజరాత్ భాగంలో ఉన్నాయి ఈ భాగం తాపీ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇలాంటి రెండు రాష్ట్రాలు పంచుకునే స్టేషన్ ఇండియాలో మరొకటి ఉంది అదే రాజస్థాన్ లోని భవాని మండి రైల్వే స్టేషన్. ఇక్కడ 80% రాజస్థాన్ లో ఉండగా 20 % మహారాష్ట్ర లో ఉంటుంది. అందుకే ఇది నవాపూర్ స్టేషన్ అంత ఫేమస్ కాలేదు.
































