Naveen Chandra: నవీన్ చంద్ర అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.మొదటి సినిమాతోనే ఎంతోమంది తెలుగు అభిమానులను సంపాదించుకున్న నవీన్ చంద్ర అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈయన కేవలం హీరోగా మాత్రమే కాకుండా పలువురు హీరోల సినిమాలలో విలన్ పాత్రలలోను సహాయ నటుడి పాత్రలను నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇలా సినిమాలు వెబ్ సిరీస్ లు అనే తేడా లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ తెలుగు తమిళ కన్నడ భాషలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి నవీన్ చంద్ర సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే ఈయన ఒర్మా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం బహుశా చాలామందికి తెలియదు అయితే ఈయన పెళ్లి చేసుకున్న విషయాన్ని పెళ్లి తర్వాత సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఇలా తన వివాహం తర్వాత తన భార్య గురించి ప్రస్తావించడం చాలా అరుదు.ఇలా తన భార్యను ఎక్కడ పరిచయం చేయనటువంటి నవీన్ చంద్ర తాజాగా సోషల్ మీడియా వేదికగా తన భార్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేస్తూ తాను త్వరలోనే తండ్రి కాబోతున్నానని తెలిపారు. ఇలా నవీన్ చంద్ర తండ్రి కాబోతున్నానన్న ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

Naveen Chandra: వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫొటోస్…
ఈ క్రమంలోనే తన భార్య బేబీ బంప్ ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫైరల్ అవుతున్నాయి. త్వరలోనే నవీన్ చంద్ర తండ్రి కాబోతున్నారనే విషయం తెలియగానే అభిమానుల సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
BABY MOON ???? ❤️
Can’t wait to hold you in our Arm’s.
Advancing towards parenthood excited!!!
New phase , New life , New journey !!!
Father to be !!!! Orma❤️
Welcome to 2023 !
. pic.twitter.com/VdSefyDOX9— Naveen Chandra (@Naveenc212) February 14, 2023































