Naveen Father: అబ్దుల్లాపూర్ మెట్ లో బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది కేవలం అమ్మాయి కారణంగా ఇద్దరు స్నేహితులు కొట్టుకొని చివరికి హత్య చేసుకోవడం వరకు వెళ్లారు.అయితే నవీన్ హత్య కేసులో భాగంగా తన స్నేహితుడు హర హర హస్తము మాత్రమే కాకుండా అమ్మాయి హస్తం కూడా ఉందని అలాగే మరో స్నేహితుడు హాసన్ ప్రమేయం కూడా ఉందని తెలుస్తుంది.

నిహారికను నవీన్ ప్రేమిస్తున్నప్పటికీ హరిహర కూడా తనని ప్రేమించడంతో కేవలం ఆ అమ్మాయి కోసం హరిహర నవీన్ ను దారుణంగా చంపారు. నవీను హత్య చేయడమే కాకుండా తన శరీరంలో భాగాలను వేరు చేసే వివిధ ప్రాంతాలలో పడేసారని అయితే పోలీసులకు దొరికిపోతామని అనుమానం రావడంతో తిరిగి ఆ శరీర భాగాలన్నింటిని ఒకచోట చేర్చి ఆధారాలు దొరక్కుండా కాల్చి బూడిద చేశారంటూ నవీన్ తండ్రి ఆరోపణలు చేశారు.
ఈ విధంగా నా కొడుకు శరీరాన్ని కాల్చి వాళ్ళు మాత్రం రెస్టారెంట్ కు వెళ్లి సరదాగా ఎంజాయ్ చేస్తూ బిర్యానీ తింటున్నారు అంటూ నవీన్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా తన కుమారుడి పట్ల కర్కశంగా ప్రవర్తించిన ఆ ముగ్గురికి తప్పకుండా ఉరిశిక్ష పడాలని డిమాండ్ చేస్తూ ఆవేదన చెందారు.

Naveen Father: న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటాం…
నా కొడుకు పట్ల ఈ విధంగా ప్రవర్తించిన ఈ ముగ్గురికి తొందరగా ఉరి తీయాలి వారికి కనక ఉరి తీయకపోతే మా కుటుంబ సభ్యులు ముగ్గురం పోలీసుల ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని ప్రస్తుతం తాము బ్రతికే పరిస్థితులలో కూడా లేము అంటూ నవీన్ తండ్రి తన కొడుకుని తలుచుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు. పోలీసులు హసన్ ను ఏ2గా,
ఏ3గా కేసులో చేర్చి ఇప్పటికే విచారిస్తున్న విషయం తెలిసిందే.































