సైరా నరసింహారెడ్డి, బిగిల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తన ఖాతాలో వేసుకున్న లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.. సీనియర్ హీరోల సరసన నటించడానికి పర్ఫెక్టుగా సరిపోయే నయనతార. సాధారణంగా 4 కోట్ల పారితోషకానికి కొంచెం కూడా తగ్గని నయనతార మొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన దర్బార్ సినిమాకోసం ఏకంగా 5.5 కోట్ల పారితోషకం తీసుకుంది. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు తన రెమ్యూనరేషన్ తగ్గించుకుందని వార్తలు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో “అన్నాత్తే” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు అయితే ఈ చిత్రం లో కథానాయికగా నయనతారను అనుకున్నారట. అందుకోసం ఆమెను సంప్రదించగా “దర్బార్” చిత్రానికి తీసుకున్నట్టుగా 5.5 కోట్లు అడిగిందట. దీనితో నయనతార పారితోషకాన్ని తాము తూగలేమని చేతులెత్తేసారు సన్ పిక్చర్స్ వారు.

దర్బార్ సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ ఒక కార్పొరేట్ సంస్థ.. ప్రస్తుతం “అన్నాత్తే” నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ తమిళనాడుకు చెందిన ప్రాంతీయ సంస్థ కావడంతో నయన్ అడిగిన పారితోషకాన్ని ఇవ్వలేమని చెప్పేశారట. దీంతో ఈ సినిమాను వదులుకోవడం ఇష్టంలేక ఆమె తక్కువ పారితోషకాన్ని ఒప్పుకుందని వినికిడి.


































