మెగాస్టార్ సరసన లేడీ సూపర్ స్టార్.. భారీగా డిమాండ్ చేసిన పారితోషికం!

0
87

మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వరుస సినిమాలను లైన్ లో పెట్టి ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య”సినిమాల్లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత మెగాస్టార్ మలయాళ సూపర్ హిట్ చిత్రం “లూసిఫర్” రీమేక్ చేయనున్నారు.

మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తెలుగులో ఈ సినిమాలో చిరు నటించగా.. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఒరిజినల్ సినిమాలో హీరోయిన్ పాత్ర ఉండదు. కానీ తెలుగులో మాత్రం కథలో కొద్దిగా మార్పులు చేసి హీరోయిన్ పాత్రను సృష్టిస్తున్నారు.

ఈ క్రమంలోనే తెలుగులో రీమేక్ అవుతున్న లూసిఫర్ చిత్రంలో మెగాస్టార్ సరసన ఎవరు నటిస్తారనే విషయంపై ఉత్కంఠత నెలకొంది.ఈ క్రమంలోనే చిత్రబృందం లేడీ సూపర్ స్టార్ నయనతారను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం నయనతారను కలసి సంప్రదింపులు చేశారనే సమాచారం వినబడుతోంది.

లూసిఫర్ చిత్రంలో నయనతార పాత్ర చిన్నదే అయినప్పటికీ ఈమె అధిక మొత్తంలో పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి లూసిఫర్ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నటించాలంటే.. ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే.. మరి చిత్రబృందం నయనతారకు భారీ మొత్తంలో పారితోషికం ముట్టజెప్పి ఆమెను రంగంలోకి దింపుతారా..లేక మరో హీరోయిన్ కోసం వేట మొదలు పెడతారా.. అనే విషయం తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here