Nayanatara -Prabhudeva: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి నయనతార ఒకరు. సౌత్ ఇండస్ట్రీలోనే అగ్ర తారగ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం వరుస సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న నయనతార గతంలో తన వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు.

నయనతార ప్రస్తుతం డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే ఈయనని పెళ్లి చేసుకోవడానికి అంటే ముందు ఈమె ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ప్రేమలో పడిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎక్కడికి వెళ్లినా వీరిద్దరు జంటగా కలిసి వెళ్లేవారు పెళ్లికి ముందే సహజీవనం కూడా చేశారు.
ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుదేవా తన మొదటి భార్య రమాలత్ కి కూడా విడాకులు ఇచ్చారు. దీంతో ఆమె నయనతారపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా నయనతారకు శాపనార్థాలు కూడా పెట్టారు. ఈ విధంగా ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇవ్వడం జరిగిపోయింది. ఇక వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అన్న తరుణంలోనే ప్రభుదేవా నయనతార ఇద్దరు కూడా బ్రేకప్ చెప్పుకున్నారు.
పిల్లలే కారణమా…
ఇలా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడానికి సరైన కారణం మాత్రం తెలియలేదు కానీ అప్పట్లో వీరి బ్రేకప్ కి బలమైన కారణం ఏంటనే విషయం గురించి కోలీవుడ్ మీడియాలో ఓ వార్త సంచలనంగా మారింది. ప్రభుదేవా మొదటి భార్యకు ముగ్గురు సంతానం కాగ వీరిలో పెద్దబ్బాయి క్యాన్సర్ తో బాధపడుతూ మరణించారు. అయితే మిగిలిన ఇద్దరు పిల్లలని పెళ్లి అయిన తర్వాత తమ వద్ద ఉంచుకోవాలని నయనతారకు ప్రభుదేవా చెప్పారట అది ఇష్టంలేని నయనతార తనతో గొడవ పడేదని ఈ గొడవల కారణంగానే బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది.



























