Neha Chowdary: బిగ్ బాస్ కార్యక్రమం ముచ్చటగా మూడవ వారం పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నామినేషన్స్ లో 9 మంది ఉండగా డేంజర్ పొజిషన్లో ఉన్నటువంటి ఇనయ, వాసంతి, నేహా చౌదరి ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ భావించారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి మూడవ వారం నేహా చౌదరి బయటకు వచ్చారు.

ఎలిమినేషన్ టాస్క్ లో భాగంగా చివరిగా వాసంతి నేహా శర్మ మాత్రమే మిగిలిపోయారు. వీరిద్దరిలో ఒకరిని సేవ్ చేసి మరొకరిని బయటకు పంపించాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే తులాభారం టాస్క్ లో భాగంగా వారిద్దరి ఫోటోలలో ఎవరు తక్కువ వెయిట్ ఉంటే వాళ్లు ఎలిమినేట్ అయినట్టు అని నాగార్జున చెప్పడంతో చివరికి నేహా శర్మ బయటకు వచ్చింది.
ఈ విధంగా ఈమె బిగ్ బాస్ వేదిక పైకి వచ్చిన అనంతరం తన ఏవి చూసినా తర్వాత ఈమె మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తాను ఇక్కడ నిలబడ్డాను అంటే అందుకు గల కారణం రేవంత్. రేవంత్ వల్లే తాను ఎలిమినేట్ అయ్యానంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.ఇక బిగ్ బాస్ హౌస్ లో తనకు ఎంతో మంచి బాండింగ్ ఏర్పడినటువంటి వ్యక్తి రాజశేఖర్ గురించి కూడా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

Neha Chowdary: రాజశేఖర్ తో ఉన్న బాండింగ్ గుర్తుచేసుకొని ఎమోషనల్ అయినా నేహా…
ఈ క్రమంలోనే నేహా చౌదరి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలు నుంచి తన లైఫ్ లోకి ఏ అబ్బాయిని రానివ్వలేదని,అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ తో తనకు మంచి బాండింగ్ ఏర్పడిందని అయితే నువ్వు బయటకు వచ్చిన తర్వాత కూడా మన ఈ ఫ్రెండ్ షిప్ ఇలాగే కొనసాగిద్దాము అక్కడ కూడా నీకు బాడీగార్డ్ గా ఉంటాను అంటూ ఈ సందర్భంగా రాజశేఖర్ తో తనకున్న ఫ్రెండ్షిప్ గురించి బయట పెడుతూ ఎమోషనల్ అయ్యారు.



























