Anchor Shyamala: బుల్లితెర యాంకర్ గా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్యామల ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.పలు బుల్లి తెర కార్యక్రమాలకు అలాగే సినిమా ఈవెంట్లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉండటమే కాకుండా మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా కెరియర్లో ఎంతో బిజీగా ఉండే శ్యామల సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకోవడం లేదా ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో తన విషయాల గురించి ముచ్చటిస్తూ ఉంటారు.

ఇదిలా ఉండగా తాజాగా శ్యామల ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ తన దగ్గర నుంచి సమాధానాలు రాబట్టారు. ఇలా కొంతమంది నెటిజన్లు తన కొడుకు ఇషాన్ గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నారు.

బుల్లి చెల్లిని ఇవ్వచ్చు కదా….
ఇక మరొక నెటిజెన్ ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా మీ అబ్బాయి ఇషాన్ ఆడుకోవడానికి బుల్లి చెల్లిని ఇవ్వచ్చు కదా అంటూ సలహా ఇచ్చారు. ఇక ఈ ప్రశ్న విన్న శ్యామల ఓరీ దేవుడా అంటూ… నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేసింది. ఇలా ఈమె చెప్పిన సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.































