Anchor Anasuya: జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ అదే గుర్తింపుతో సినిమాలలో అవకాశాలు దక్కించుకుని వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇలా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా ఈ యాంకరమ్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే అనుసూయ సోషల్ మీడియా వేదికగా తన భర్త భరద్వాజ్ తీసిన కొన్ని ఫోటోలను తన భర్త గిఫ్ట్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో అనసూయ క్యాజువల్ వేర్ ధరించి ఫోటోలకు హాట్ ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలా మంది నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఒక నెటిజన్ పాత లొల్లిని తీసుకొచ్చి మరోసారి అనసూయ ముందు ఉంచారు. ఏంటి సెల్ఫీ అడిగితే ఫోన్ పగలగొట్టారంటగా అంటూ అనసూయను ప్రశ్నించారు. దీంతో అనసూయ స్పందిస్తూ ఎవరు సార్ మీకి చెప్పింది అంటూ ప్రశ్నించారు. ఇంతలో ఆ నెటిజన్ స్పందిస్తూ..ఆ వీడియో మీకు పంపుతాను అందులో ఉన్న కార్ నెంబర్ కూడా మీదే ఇది ఫేక్ అయితే మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ తెలియజేశాడు.
కొందరు బ్రతకడం కోసం ఇలా చేస్తారు..
దీనికి స్పందించిన అనసూయ.. మీకు నాదో విన్నపం యూట్యూబ్ ఛానల్ లో వచ్చే వాటిని నమ్మకండి వారు బ్రతకడం కోసం ఏమైనా చేస్తారు… ఇలాంటి వాటిని చూసినప్పుడు మానవత్వం చచ్చిపోయిందనిపిస్తుంది.దయచేసి ఒకరిపట్ల ఒకరు బాధ్యతగా ఉందాం నా గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే మరి కొందరు ఈ విషయంపై స్పందిస్తూ ఇలా పాత వీడియోలను మళ్ళీ తవ్వుకోవడం కరెక్ట్ కాదని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
































