Anchor Anasuya: బుల్లి తెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వెండితెరపై వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ పలుసార్లు నెటిజన్ల ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు.

ముఖ్యంగా అనసూయ వస్త్రధారణపై ఎంతోమంది కామెంట్లు చేసినప్పటికీ వారికి ధీటుగా సమాధానం చెబుతుంది. ఇలా ఎన్నో సార్లు జరిగినప్పటికీ తరుచూ నెటిజన్లు ఈమె వస్త్రధారణపై కామెంట్లు చేస్తూ ఉంటారు. తాజాగా మరోక నెటిజన్ అనసూయ వస్త్రధారణ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సదరు నెటిజెన్ స్పందిస్తూ అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లలకి తల్లి అయ్యారు. ఇంకా ఇలాంటి పొట్టి పొట్టి దుస్తులు వేసుకుంటారా… ఇలాంటి దుస్తులు వేసుకొని తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నారు అంటూ కామెంట్ చేశారు.
మగ జాతి పరువు తీయొద్దు…
ఈ క్రమంలోనే ఈ కామెంట్ పై అనసూయ స్పందిస్తూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈ కామెంట్ పై అనసూయ స్పందిస్తూ… దయచేసి మీ పని మీరు చేసుకోండి.. నన్ను నా పని చేసుకోనివ్వండి మీరు ఇలా ఆలోచించి మగ జాతి పరువు తీస్తున్నారు అంటూ అనసూయ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి కామెంట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇలాంటి కామెంట్లు ఎదుర్కోవడం అనసూయకు కొత్తేమీకాదు. ఇలాంటి వారికి అనసూయ తనదైన శైలిలో సమాధానం చెబుతూ తనపని తాను చేసుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
దయచేసి మీరు మీ పనిని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు ???????????? https://t.co/Uy4P00bmAE
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 4, 2022



























