Vijayashanthi: విజయశాంతి.. స్టార్ హీరోయిన్ గా దాదాపు సౌతిండియాలో అందరు అగ్రనటులతో నటించింది. తెలుగులో లేడీ ఓరియంట్ సినిమాకు కేరాఫ్ గా నిలిచింది. తన కంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంది. ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్న విజయశాంతి… ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. బీజేపీ పార్టీలో విజయశాంతి ఫైర్ బ్రాండ్ గా ఉంది. రాజకీయాల్లో ఉన్నప్పటికీ అడపాదడపా సినిమాల్లో కూడా కనిపిస్తోంది.

గతేడాది.. మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఇంపార్టెంట్ పాత్ర పోషించింది. కథ నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పింది. అయితే సంవత్సరం నుంచి కొత్తగా ఏ సినిమాను కూడా ఒప్పుకున్నట్లు లేదు. అయితే తాజాగా ప్రిన్స్ మహేష్ బాబుకు కరోనా సోకింది.
నా గురువులు ఆ సంస్కారాన్ని నేర్పించారు..
ఈవిషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలే ఉన్నట్లు తెలిపాడు. అయితే వ్యాక్సిన్ వేయించుకోని వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించాడు. వ్యాక్సిన్ వల్ల మనం హాస్పిటల్ లో చేరే పరిస్థితి ఏర్పడదని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే విజయశాంతి.. ‘మహేష్ బాబు గారు’ త్వరగా కోలుకోవాలని కామెంట్ చేసింది. దీన్ని చూసిన ఓ నెటిజెన్… మహేష్ బాబు అంటే సరిపోతుంది కదా మేడమ్ ..‘గారు’ ఎందుకని ప్రశ్నించాడు. ఆ నెటిజెన్ కు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది విజయశాంతి. ‘‘నా గురువులు అటల్ బిహారీ వాజ్ పేయి జీ, అద్వానీ జీ నాకు ఇది నేర్పించారని.. వాళ్లేప్పుడు తనని విజయశాంతి గారు అనే సంభోదిస్తారని.. నేను కూడా అలానే ఎవరినైనా ‘గారు’ అనే సంభోదిస్తా అని చెప్పింది. చిన్నవారి
































