Mohan Babu: తెలుగు చిత్ర పరిశ్రమంలో నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన హీరోగా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా విద్యావేత్తగా కూడా ఎన్నో పాఠశాలలను కళాశాలలను స్థాపించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. ఇకపోతే 2019వ సంవత్సరంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మోహన్ బాబు తన కుమారులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు మోహన్ బాబు కుమారులపై పోలీస్ కేసు నమోదు చేశారు. ఇప్పటికీ ఈ కేసు జరుగుతూనే ఉంది. తాజాగా మంగళవారం మోహన్ బాబు తన కుమారులతో కలిసి తిరుపతి కోర్టుకు హాజరయ్యారు.ఈ క్రమంలోనే ఈయన తిరుపతిలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కోర్టుకు పాదయాత్రగా వెళ్లడంతో పెద్ద ఎత్తున మీడియం చుట్టుముట్టి ఈయనను పలు ప్రశ్నలు వేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు చెప్పాల్సిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏవేవో ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తిరిగి కోర్టు విచారణ వాయిదా ఎప్పుడు అని మీడియా ప్రశ్నించగా ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ తనకు కోర్టు ఏ విధమైనటువంటి సమన్లు జారీ చేయలేదని కేవలం జడ్జిగారు పిలిస్తేనే తాను వెళ్లానని సమాధానం చెప్పారు.
సమన్లు జారీ చేయకుండానే సంతకం పెట్టారా…
ఇక మోహన్ బాబు చెప్పిన మాటల ప్రకారం జడ్జిగారు పిలవడం అంటే సమన్లు, లేదా నోటీసులు పంపడమే కదా అర్థం అంటూ పలువురు ఈయన వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.అక్కడికేదో జడ్జిగారు మోహన్ బాబుని పిలిచి కుశల ప్రశ్నలు అడిగినట్లు ఈయన సమాధానం చెప్పారు అంటూ మరోసారి నేటిజన్ల మోహన్ బాబు కుటుంబం పై కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఏదైనా చెప్పినా నమ్మేలా ఉండాలి మోహన్ బాబు గారు జడ్జి గారి పిలిస్తే వెళ్లి సంతకం పెట్టానని చెప్పడం ఏంటో అంటూ మరోసారి మంచు ఫ్యామిలీ పై ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.































