Shruti Haasan: టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు అభిమానులకు మధ్య ఉన్న వ్యత్యాసం పూర్తిగా తగ్గిపోయింది.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్దఎత్తున వారి అభిమాన హీరో హీరోయిన్లతో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఈ విధంగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉన్న సమయంలో సెలబ్రిటీలకు పలు రకాల వింత ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి వింత ప్రశ్న నటి శృతి హాసన్ కు ఎదురైంది.

కెరియర్ మొదట్లో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకున్న శృతి హాసన్ గబ్బర్ సింగ్ సినిమాతో తన మీద ఉన్న ఈ ముద్రను తొలగించి గోల్డెన్ లెగ్ అనిపించుకుంది.ఇలా ఇండస్ట్రీలో దూసుకుపోతూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సినిమాలకు కాస్త విరామం ఇచ్చి తిరిగి తనదైన శైలిలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. శృతి హాసన్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, బాలకృష్ణ, చిరంజీవి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఈ విధంగా సినిమాలలో ఎంతో బిజీగా ఉండే శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇలా శృతిహాసన్ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు క్షణాలలో వైరల్ అవుతుంటాయి. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా శృతిహాసన్ అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు.
ఆ సైజ్ కూడా ఉంటుందా…
తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆస్క్ మీ ఏనీ థింగ్ అంటూ అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఎవరు అడగనటువంటి ఒక విచిత్ర ప్రశ్న వేశారు. ఈ సందర్భంగా నెటిజన్ శృతి హాసన్ ని ప్రశ్నిస్తూ మీ లిప్ సైజ్ ఎంత అని అడిగారు. ఈ ప్రశ్న విన్న శృతిహాసన్ లిప్ సైజు కూడా ఉంటుందా?అని ఎదురు ప్రశ్న వేయడమే కాకుండా ఒక సెల్ఫీ ఫోటో షేర్ చేస్తూ నా లిప్ సైజ్ ఎంతో నువ్వే కొలుచుకో అంటూ నెటిజన్ కు దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. శృతిహాసన్ సమాధానం విన్న నెటిజన్లు ఈమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.


































