Sreemukhi Marriage: సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రెటీలను నిత్యం వెంటాడుతున్న ప్రశ్న మీ పెళ్లెప్పుడు. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలకు ఈ ప్రశ్న తరచు ఎదురవుతూ వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. వెండితెర సెలబ్రిటీల నుంచి బుల్లితెర సెలబ్రిటీల వరకు ఎంతో మంది ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయారు. అలాంటి వారిలో బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రస్తుతం శ్రీముఖి బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ మరోవైపు వెండితెర సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈమె ఈటీవీ ప్లస్ లో ప్రసారం అవుతున్న జాతిరత్నాలు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా శ్రీముఖి పెళ్లి ప్రస్తావన వచ్చింది.

ఈ క్రమంలోనే కొత్త కమెడియన్ శ్రీముఖి పెళ్లి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రేమోలో భాగంగా శ్రీముఖి నా పెళ్లి ఎప్పుడు అవుతుందో చెప్పు అంటూ శ్రీముఖి అడిగింది. ఈ ప్రశ్నకు ఆ కమెడియన్ చెప్పిన సమాధానం విన్న శ్రీముఖి ఒక్కసారిగా కంగుతింది.
షాక్ లో శ్రీముఖి…
‘తిన్న ఇస్తరాకును కడిగి వాడటం, నూకరాజు తెల్లగా మారడం, నీకు పెళ్లవడం.. జన్మలో జరగవు” అంటూ కామెంట్ చేశాడు. ఈ విధంగా ఆ కమెడియన్ చేసిన కామెంట్ వినగానే శ్రీముఖి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరెందుకాలస్యం ఈ ప్రోమో పై మీరు ఓ లుక్కేయండి.
































