టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సమంత నాగచైతన్య విడాకుల విషయం హాట్ టాపిక్ గా మారింది. అక్టోబర్ 2వ తేదీ విడాకులు తీసుకోబోతున్నట్లు అధికారికంగా సమంత నాగచైతన్య దంపతులు ప్రకటించినప్పటి నుంచి వీరు విడాకులకు కారణం ఏంటని నెటిజన్లు పెద్దఎత్తున ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి విడాకుల విషయం పై ఎన్నో కథనాలు పుట్టుకొస్తున్నాయి.

ఇకపోతే సమంత విడాకులు తీసుకోవడానికి గల కారణం తన పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్ ప్రధాన కారణమని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు తనని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రీతమ్ జుకాల్కర్ ను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

ప్రీతమ్ తన స్టోరీలో భాగంగా దీపు అనే ఒక లో లైఫ్ మనిషి నన్ను ఎంతో టార్చర్ చేస్తున్నాడు. తన ఇంస్టాగ్రామ్ రిపోర్ట్ చేయండి అంటూ ప్రీతమ్ జుకాల్కర్ తన ఫాలోవర్స్ ని అడుక్కుంటున్నాడు. ప్రస్తుతం ఈ ఇంస్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే సమంతకు తనకు మధ్య ఏదో సంబంధం ఉందని గత మూడు రోజుల నుంచి పెద్ద ఎత్తున కథనాలు వెలువడుతున్నాయి ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు ప్రీతమ్ జుకాల్కర్ పై దారుణంగా కామెంట్లు చేయడంతో ప్రీతమ్ తన కామెంట్ సెక్షన్‌ని డిసేబుల్ చేసిన సంగతి మనకు తెలిసిందే.


































