Chandra Hass: సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఏ చిన్న పని చేసిన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం సర్వసాధారణం అయితే కొన్నిసార్లు వీరు చేసిన పనుల వల్ల పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు.ఇలా సోషల్ మీడియా వేదికగా ఈ మధ్యకాలంలో ఎంతో మంది సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ట్రోల్ అవుతూ ఉన్నారు. ఇకపోతే తాజాగా యాటిట్యూడ్ స్టార్ గా పేరు సంపాదించుకున్న టీవీ నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ గురించి సుపరిచితమే.

ఈయన మొదటి సినిమా అనౌన్స్మెంట్ కార్యక్రమంలోనే తన యాటిట్యూడ్ ప్రదర్శించి ఏకంగా పేరు సంపాదించుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున నేటిజెన్ల ట్రోలింగుకు గురయ్యారు.ఇలా ఈయన గురించి భారీ స్థాయిలో ట్రోలింగ్ రావడంతో ప్రభాకర్ స్పందించి ఇప్పుడే ఇంకా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు ముందు ముందు అన్ని నేర్చుకుంటారు అంటూ సమాధానం చెప్పారు. ఇకపోతే తాజాగా మరోసారి చంద్రహాస్ భారీ స్థాయిలో ట్రోలింగ్ కి గురయ్యారు.
ఇంతకీ చంద్రహాస్ ఇప్పుడేం చేశారు ఎందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారు అనే విషయానికి వస్తే.. చంద్రహాస్ తన తండ్రి ప్రభాకర్ తో కలిసి అయ్యప్ప స్వామి మాల ధరించారు.అయ్యప్ప మాల ధరించిన వారు దీక్షలో ఉన్నన్ని రోజులు స్వామిని సేవిస్తూ ఎంతో డిగ్నిటీగా నడుచుకుంటారు. కానీ మన యాటిట్యూడ్ స్టార్ మాత్రం తన స్టైల్ లో ఈ ఆటిట్యూడ్ ప్రదర్శించి భారీగా ట్రోల్ అవుతున్నారు.

Chandra Hass: కొత్త కారుతో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన చంద్రహాస్…
ప్రభాకర్ కుటుంబం తాజాగా తార్ కారును కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే కొత్త కారును కొనడంతో కుటుంబ సభ్యులందరూ కలిసి ఫోటోలు దిగారు. కానీ చంద్రహాస్ మాత్రం చొక్కా లేకుండా కారు ముందు వివిధ రకాల ఫోజులిస్తూ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈయన నేటిజన్ల ట్రోలింగ్ కి గురయ్యారు. మాలలో ఉన్నప్పుడు భక్తి భావంతో ఉండకుండా ఇలా పిచ్చి చేష్టలు చేయడం ఏంటి అని పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.































