Revanth Reddy -Gangavva: మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు గంగవ్వ. ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా గ్రామీణ ప్రాంతంలో ప్రజల జీవన విధానం ఎలా ఉంటుందనే విషయాలన్నింటినీ కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడంతో యూట్యూబ్ ఛానల్ కు విపరీతమైనటువంటి ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి గంగవ్వకు సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి.

ఇక ఈమెకు ఒక మంచి ఫాలోయింగ్ రావడంతో బిగ్ బాస్ కి వెళ్లి వచ్చారు. అదేవిధంగా పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. ఇలా 60 సంవత్సరాల వయసులో సెలబ్రిటీ హోదా సంపాదించుకున్నటువంటి గంగవ్వతో ఎంతోమంది సినీ రాజకీయ నాయకులు ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. ఇలా ఒక సినిమా విడుదల సమయంలో సెలబ్రిటీలు గంగవ్వతో మాట్లాడుతూ తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు.
ఇక తెలంగాణ ఎన్నికల సమయంలో కేటీఆర్ కూడా గంగవ్వతో ముచ్చట్లు పెట్టారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా గంగవ్వ టీం తో కలిసి కేటీఆర్ ముచ్చట్లు పెడుతూ పచ్చని పొలాలలో నాటుకోడి బిర్యానీ వండుతూ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా కేటీఆర్ తో ముచ్చట్లు పెడుతూ బిఆర్ఎస్ పార్టీని ప్రమోట్ చేసినటువంటి గంగవ్వ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో అవ్వ కూడా పార్టీ మార్చిందని తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి తో గంగవ్వ ముచ్చట్లు…
తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే రేవంత్ రెడ్డి గెలవగానే గంగవ్వ తనని కలిసి ఆయనతో ముచ్చట్లు పెట్టారు. అంతేకాకుండా తనకోసం ప్రత్యేకంగా మిర్చి బజ్జి తీసుకెళ్లి కూడా తినిపించారు ఇలా గంగవ్వ రేవంత్ రెడ్డితో ముచ్చట్లు పెడుతున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈమెపై ట్రోల్ చేస్తున్నారు. గతంలో బిఆర్ఎస్ పార్టీని ప్రమోట్ చేసిన గంగవ్వ కాంగ్రెస్ గెలవగానే తను కూడా పార్టీ మార్చింది అంటూ ట్రోల్ చేస్తున్నారు.

































