Whatsapp: ఒకప్పుడు బ్యాంకు లావాదేవీలు అంటే పొద్దు పట్టేది. అలాంటిది ఇప్పుడు అరచేతిలోనే పనులు అయిపోతున్నాయి. యూపీఐ ద్వారా ఫోన్ పే, గుగూల్ పే, భీమ్ యాప్ ల ద్వారా క్షణాల్లో ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు.

దేశంలో నగదు లావాదేవీలను సులువు చేసింది. ప్రస్తుతం ఇండియాలో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్లు బాగానే జరుగుతున్నాయి. ప్రపంచంలోనే నగదు రహిత లావాదేవీల్లో ముందుస్థానంలో భారత్ నిలుస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ప్రతీ దుకాణాల్లో, ప్రతీ షాపింగ్ మాల్లో క్యూఆర్ కోడ్ లేకుండా వ్యాపారం జరగడం లేదు.

ఇదిలా ఉంటే వాట్సాప్ కూడా ప్రస్తుతం నగదు లావాదేవీలు అందించే సేవలు ప్రారంభించనుంది. ఇన్నాళ్లు కేవలం మెసేజింగ్ ఫ్లాట్ ఫాం గా ఉన్న వాట్సాప్.. మనీ టాన్స్ఫర్ చేసే ఫీచర్ ను కూడా తీసుకువచ్చింది.
ఇక గుగూల్ పే, ఫోన్ ఫేలకు గట్టి పోటీ ఇవ్వనుంది. అయితే ఇందులో కొత్తగా కొన్ని ఫీచర్లను కూడా యాడ్ చేస్తోంది వాట్సాప్. యూపీఐ పిన్ మార్చుకునే సదుపాయాన్ని కూడా కల్పించింది. 2020లో లాంచ్ చేసిన ఈ ఫీచర్ కు పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) నుంచి అనుమతులు కూడా వచ్చాయి. మొత్తం 227 బ్యాంకులతో అనుసంధానమైన రియల్ టై పేమెంట్ సిస్టమ్ ను నడిపిస్తోంది.
మరి యూపీఐ మార్చుకోవాలంటే.. ఇలా చేయాలి
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ని ఓపెన్ చేయండి.
కుడివైపు పైభాగంలోని ఆప్షన్లపై నొక్కి, పేమెంట్స్‌పై నొక్కండి.
పేమెంట్ సెక్షన్స్ కింద, మీరు UPI పిన్ నంబర్‌ను మార్చాలనుకుంటున్న బ్యాంక్ అకౌంట్ సెలక్ట్ చేసుకోండి.
ఆపై UPI పిన్ చేంజ్ ఆప్షన్‌పై నొక్కండి.
ఇప్పటికే ఉన్న UPI పిన్‌ని నమోదు చేసి, ఆపై కొత్త UPI పిన్‌ని నమోదు చేయండి.
కొత్త UPI పిన్ నంబర్‌ని నిర్ధారించాలి.
యూపీఐ పిన్ మర్చిపోతే..
Forgot UPI పిన్‌పై నొక్కండి.
CONTINUE ఎంచుకుని, మీ డెబిట్ కార్డ్ నంబర్ యొక్క చివరి 6-అంకెలు మరియు చివరి తేదీని నమోదు చేయండి (కొన్ని బ్యాంకులు మీ CVV నంబర్‌ను కూడా అడగవచ్చు. దీని తర్వాత మీరు మీ UPI పిన్‌ని రీసెట్ చేసుకోవచ్చు.































