AP: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమంపై రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా ఐదు ఫైళ్లపై సంతకం చేశారు చంద్రబాబు నాయుడు. మొదటి సంతకంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఏపీలో ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చలలో వాలంటీర్ వ్యవస్థ ఒకటి అని చెప్పాలి.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రజలందరూ రేషన్ పెన్షన్ అందుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే పరిపాలన ఇంటి ముంగిటకే తీసుకురావడం కోసం గ్రామంలోనూ సచివాలయాలను నిర్మించి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు.
ప్రజల ముంగిటికే పరిపాలన అనే విధంగా వాలంటీర్ సహాయంతో రేషన్, పెన్షన్ తో పాటు ఏ విధమైనటువంటి సర్టిఫికెట్స్ కావాలన్నా వాలంటీర్స్ ఇంటి దగ్గరికి వచ్చి సేవలు అందించారు. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను గత ప్రతిపక్ష నేతలు అయిన జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యతిరేకించారు.
తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తామని తెలిపారు. అయితే ఎన్నికలకు ముందు వాలంటీర్ వ్యవస్థ కీలకంగా మారడంతో తాము అధికారంలోకి వచ్చిన పదివేల రూపాయల వేతనంతో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు.
వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు..
ఇక వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారని తెలియజేశారు.. వాలంటీ ద్వారానే పెన్షన్ ఇంటి వద్దకే పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపడతామని కానీ త్వరలోనే ఈ విషయం కి సంబంధించి అన్ని విషయాలు ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.





























