మన భారతదేశంలో ఆధార్ ప్రాముఖ్యత ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆధార్ అనేది భారతదేశ నివాసికి ఉచితంగా యుఐడిఎఐచే జారీచేయబడిన 12 అంకెల గుర్తింపు సంఖ్య. జన్మించిన శిశువు నుండి వయో వృద్ధుల వరకు అందరూ ఆధార్ కోసం నమోదు చేయించుకోవచ్చు. ఆధార్ ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ.

ప్రపంచ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త పాల్ రోమర్ ఆధార్‍ను “ప్రపంచంలో అత్యంత అధునాతన గుర్తింపు కార్యక్రమం”గా అభివర్ణించాడు. దీనిని 2009లో ప్రారంభించారు. ఇక దీని ద్వారా ప్రభుత్వాలు అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలు, రేషన్, మెడికల్, ఆర్థిక, బ్యాంకింగ్ సేవలన్నింటికీ ఇప్పుడు ఈ ఆధారే ప్రాథమికంగా మారింది.
ఈ ఆధార్ కార్డు ద్వారా సిమ్ కార్డు తీసుకోవచ్చు. అడ్రస్ ఫ్రూవ్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు. ఇటీవల భారత్ లో నకిలీ ఆధార్ కార్డులు బయటపడ్డాయి. కొందరు విదేశీయులు అక్రమంగా ఆధార్ కార్డులు పొంది ఇక్కడ నివాసం ఏర్పచుకున్నారు. వీటి వల్ల దేశ భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. అందువల్లే.. ఆధార్ భద్రత కోసం ప్రభుత్వం చర్యలు చెపట్టింది.
ఈ సంవత్సరంలో దీనికి కొత్త రూపాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇక కొత్త ఫీచర్లను యాడ్ చేసి.. ఏటీఎం కార్డు రూపంలో ఆధార్ పీవీసీ కార్డ్‌ను ప్రవేశపెట్టింది. ఈ కార్డుపై ఎన్నో సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ కార్డుపై హోలోగ్రామ్, గిల్లోచే ప్యాటర్న్, గోస్ట్ ఇమేజ్, మైక్రోటెక్స్ట్ ఉంటాయి. ఈ కొత్త కార్డులను uidai.gov.in వెబ్ సైట్ కు వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.































