పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో నటిస్తున్నటువంటి చిత్రం “భీమ్లా నాయక్”. మలయాళంలో ఎంతో విజయవంతమైన “అయ్యప్పనుమ్ కోషియమ్” సినిమాను పవన్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించగా.. రానా దగ్గుబాటి డానియల్ శేఖర్ పాత్రలో సందడి చేయనున్నారు.అయితే ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి కేవలం భీమ్లా నాయక్ పాత్రకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేస్తూ ప్రేక్షకులను సందడి చేశారు.

ఈ క్రమంలోనే రానాకి సంబంధించి ఒక అప్డేట్ కూడా లేదంటూ రానా అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే భీమ్లా నాయక్ చిత్రంలోని డానియల్ శేఖర్ పాత్రకు సంబంధించిన సరికొత్త సమాచారం త్వరలోనే వెలువడుతుందని చిత్రబృందం తెలియజేశారు. తాజాగా ఈ సినిమాలోని హీరో రానా లుక్ కి సంబంధించిన పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేవిధంగా రానా డానియల్ శేఖర్ పూర్తి లుక్ ను సెప్టెంబర్ 20వ తేదీ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం రానా పాత్రకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే ఇప్పటికే దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ట్రైలర్, టైటిల్ సాంగ్ ని విడుదల చేయగా ఇవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమా మాత్రమే కాకుండా క్రిష్ దర్శకత్వంలో హరిహర మీరు మల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు మనకు తెలిసిందే.






























