Pushpa Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పటికీ పుష్ప మానీయా కనబడుతుంది.

ఇక హిందీలో ఏమాత్రం ప్రమోషన్ లేకుండా, విడుదలైన ఈ సినిమా ఏకంగా వంద కోట్లను రాబట్టి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది.దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాలలో ప్రేక్షకులు పుష్ప సినిమాని బాగా ఆదరించారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఎంతోమంది పుష్ప సినిమాలు పాటలకు డాన్సులు చేస్తూ పుష్పరాజ్ డైలాగులు చెబుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ముఖ్యంగా క్రికెటర్లు రవీంద్ర జడేజా, డేవిడ్ వార్నర్, బ్రావో, శిఖర్ ధావన్ వంటి వారు కూడా పుష్ప డైలాగులు చెబుతూ వీడియోలను షేర్ చేశారు. అదేవిధంగా బంగ్లాదేశ్ వేదికగా ప్రీమియర్ లీగ్ జరుగుతుండగా… క్రికెటర్స్ సిక్స్ కొట్టినప్పుడు ఫోర్ కొట్టినప్పుడు లేదా వికెట్ తీసినప్పుడు తగ్గేదే లే అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
ప్రమోషన్ కోసం డబ్బులిచ్చిన అమెజాన్…
ఇలా వీరందరూ పుష్ప వీడియోలు చేస్తూ ఆ వీడియోలను షేర్ చేయడంతో పుష్ప సినిమా విపరీతంగా నచ్చిందని ప్రతి ఒక్కరు భావించారు. కానీ నిజానికి ఈ సినిమా ఓటు హక్కులను అమెజాన్ దక్కించుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా ప్రమోషన్ కోసం అమెజాన్ ఇలా క్రికెటర్లకు డబ్బులు చెల్లించి ప్రమోషన్ చేయించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదంతా స్క్రిప్టు ప్రకారమే జరిగిందని వాదన తెరపైకి వచ్చింది మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.






























