Ntr: నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఒక స్థలం విషయంలో ఈయన కోర్టు మెట్లు ఎక్కారంటూ పెద్ద ఎత్తున వార్తలు సంచలనంగా మారాయి. ఎన్టీఆర్ గీత అనే మహిళ వద్ద కోట్లలో విలువ చేసే స్థలం కొన్నారని అయితే ఆ స్థలం పై ఆమె బ్యాంకు లోన్ తీసుకోనీ వాటిని కట్టకుండా ఎగ్గొట్టారంటూ వార్తలు వచ్చాయి.

ఇలా స్థల వివాదం కారణంగా ఎన్టీఆర్ భారీ నష్టాలను ఎదుర్కోబోతున్నారు అందుకే కోర్టును ఆశ్రయించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలపై తాజాగా ఎన్టీఆర్ టీం స్పందించారు.ఎన్టీఆర్‌కు సంబంధించి ఈరోజు ప్రచురితమైన వార్తలకు ప్రతిస్పందనగా ఈ ప్రకటన చేస్తున్నామని పేర్కొన్నారు.
ఏ స్థలం గురించి అయితే చర్చ జరుగుతున్నదో అదే స్థలాన్ని 2013లో ఎన్టీఆర్ విక్రయించారని మేము స్పష్టం చేస్తున్నామని ఇకపై ఈ స్థల వివాదానికి సంబంధించినటువంటి వార్తలలో ఎన్టీఆర్ పేరును ఉపయోగించడానికి వీలులేదు అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ టీమ్ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
ఎన్టీఆర్ పేరు వాడటానికి వీలు లేదు..
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈయన దేవర సినిమాతో పాటు బాలీవుడ్ వార్ 2 సినిమాల్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కొరటాల దర్శకత్వంలో నటిస్తున్నటువంటి దేవర సినిమా అక్టోబర్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.



























