మోదీ కోసం ఎయిర్ ఇండియా వన్ విమానం.. ప్రత్యేకతలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..?

0
294

సాధారణంగా విదేశాలలో అధ్యక్ష హోదాలో ఉన్నవారు, వీవీఐపీలు ప్రత్యేకంగా అన్ని వసతులతో, రక్షణాపరమైన సమస్యలు లేని విమానాలలో ప్రయాణిస్తుంటారనే సంగతి తెలిసిందే. అలా మన దేశంలోని వీవీఐపీలను కూడా దృష్టిలో పెట్టుకుని ఎన్నో ప్రత్యేకలతో తయారు చేసిన ఎయిర్ ఇండియా వన్ విమానం మన దేశానికి చేరుకుంది. పౌర విమానయాన శాఖ అధికారులు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు టెక్సాస్ నుంచి ఢిల్లీకు ఈ విమానం చేరుకుందని వెల్లడించారు.

దేశానికి చేరుకున్న ఈ ప్రత్యేక విమానం ద్వారానే ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇతర దేశాలకు ప్రయాణం చేయనున్నారు. అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థను కలిగి ఉన్న ఈ విమానంలో అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఎలాంటి క్షిపణి దాడులనైనా ఈ విమానం తట్టుకోగలదు. ఈ విమానంలో ఆకాశంలో విహరిస్తూనే సులువుగా ఆడియో, వీడియో కమ్యూనికేషన్ చేయవచ్చు.

డల్లాస్ లో తయారైన బోయింగ్ 777 విమానాన్నే ప్రధాని వాడనున్నారు. కేంద్రం రెండు విమానాలను కొన్ని నెలల క్రితమే ఆర్డర్ చేయగా జులైలో ఈ విమానాలు భారత్ కు రావాల్సి ఉంది. అయితే కరోనా, లాక్ డౌన్, ఇతర సమస్యల వల్ల ఈ నెలలో భారత్ కు చేరుకుంది. రెండు మూడు రోజుల్లో మరో విమానం భారత్ కు చేరుకోనుందని తెలుస్తోంది. ఈ విమానం ప్రత్యేకతల విషయానికి వస్తే ఈ విమానంలో సెల్ఫ్‌ ప్రొటెక్షన్‌ సూట్స్‌ (ఎస్‌పీఎస్‌), లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇన్‌ఫ్రేర్డ్‌ కౌంటర్‌మెజర్స్‌ (ఎల్‌ఏఐఆర్‌సీఎం) ఉన్నాయి.

ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుని విమానంలో మాత్రమే ఎస్‌పీఎస్ ఉండగా ఆ ఘనత సాధించిన మరో విమానంగా ఎయిర్ ఇండియా వన్ గుర్తింపు తెచ్చుకుంది. గంటకు 900 మీటర్ల వేగంతో ప్రయాణించే ఈ విమానంలో ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేయవచ్చు. ఫ్లయింగ్‌ కమాండ్‌ సెంటర్‌ లా పని చేసే ఈ విమానంలో ప్రధాని కార్యాలయంతో పాటు సమావేశాల నిర్వహణ కోసం పెద్ద హాల్ ఉంది.

భారత వాయుసేన పైలెట్లు నడిపే ఈ విమానాల తయారీకి 8,400 కోట్ల రూపాయలు ఖర్చైంది. ఎయిర్‌ ఇండియా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్ విమానాల బాధ్యతలను నిర్వర్తించనుంది. ఈ విమానానికి గాలిలో ఇంధానాన్ని నింపే సామర్థ్యం కూడా ఉండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here