జీవితంపై ఎన్నో ఆశలతో.. ఎంతో కలలు కని ఆమె అత్తారింట్లో అడుగుపెట్టింది. భర్తతో కలిసి జీవితాన్ని సంతోషంగా గడపాలని అనుకుంది. కానీ అనూహ్యంగా ఆమె విగతజీవిగా కనిపించింది. అసలు ఏం జరిగిందంటే.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని ఓ తండాకు చెందిన పీనాబాయి జుక్కల్ మండలం దోస్త్‌పల్లి తండాకు చెందిన వీరేశంతో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. కానీ ఉన్నట్టుండి షీనబాయి మృతి చెందింది.

ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ప్రతీ ఒక్కరూ వివిధ రకాలుగా చెబుతున్నారు. కుటుంబ సమస్యల కారణంగానే ఆమె.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆమె కుటుంబసభ్యులు మాత్రం ఆమెది హత్య అని ఆరోపిస్తున్నారు.
షీనాబాయి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం బాన్సువాడ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అదనపు కట్నం కోసం తమ కూతురును విపరీతంగా చిత్రహింసలకు గురిచేసి చంపేశారని.. ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం కోసమే అత్తింటి వారే హత్య చేశారని ఆరోపిస్తున్నారు. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మృతురాలి కుటుంబ సబ్యులు, బంధువులు భారీగా జుక్కల్ పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చారు. గ్రామంలోని ప్రతీ ఒక్కరు కూడా ఇది హత్యే అంటూ ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టు మార్టమ్ రిపోర్టు రాగానే నిజనిర్ధారణ చేసి నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.































