ఎన్నో తెలుగు చిత్రాలలో బాల నటుడుగా నటించి మెప్పించిన తరుణ్ హీరోగా నువ్వే కావాలి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తరుణ్ కి అప్పట్లో ఓ రేంజ్ లో సినిమా ఆఫర్లు వచ్చాయి. అలాగే తరుణ్ నటించిన ప్రేమకథాచిత్రాలన్నీ ప్రేక్షకులకు బాగా నచ్చేవి.. ఎంతలా అంటే? మన హీరో తరుణ్ ను లవర్ బాయ్ అని పిలిచేంతగా నచ్చేవి. అప్పట్లో తరుణ్ సినిమా విడుదలవుతుందంటే చాలు ఎక్కడాలేని ఉత్సాహంతో కుర్రకారు సినిమా థియేటర్ వైపు తరుణ్ ఫాన్స్ పరుగులు తీసేవారు..

అయితే తరుణ్ కి ఆ స్టార్ డమ్ కేవలం 2,3 సంవత్సరాలు మాత్రమే బాగా నడిచింది. ఆ తర్వాత తరుణ్ నటించిన ప్రతి సినిమా ప్లాప్ కావడంతో అతనితో సినిమా తీయాలంటేనే దర్శక, నిర్మాతలు భయపడిపోయి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత నిదానంగా సినిమా రంగానికి దూరమవుతూ వచ్చిన తరుణ్ చివరికి బిజినెస్ మ్యాన్ అయ్యాడు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల్లో నటించటం మానేసిన తరుణ్ కి పెళ్లి ఎప్పుడు.? కరోనా లాక్ డౌన్ ని కూడా లెక్క చెయ్యకుండా టాలీవుడ్ హీరోలందరూ పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ఒక్క తరుణ్ కి పెళ్లి మాత్రం కావటం లేదు. తరుణ్ పెళ్లి ఎప్పుడు అని గత 2 సంవత్సరాల క్రితమే తరుణ్ తల్లి రోజా రమణిని అడిగితే.. త్వరలోనే అని చెప్పింది. కానీ., ఇప్పటి వరుకు తరుణ్ పెళ్లి అయ్యింది లేదు..

అదిగో పెళ్లి.. ఇదిగో పెళ్లి అని అంటారే తప్ప.. పెళ్లి మాత్రం కావడం లేదు. తరుణ్ సినీ కెరీర్ బాగా ఉన్న సమయంలో టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్, తరుణ్ ప్రేమించుకున్నారని.. కానీ., తరుణ్ తల్లి రోజా రమణి వీళ్లిద్దరి ప్రేమను ఒప్పుకోలేదని అప్పట్లోనే అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో షికార్లు చేసాయి. ఈ రూమర్స్ అటు ఆర్తి అగర్వాల్ సినీ కెరీర్ పైన, ఇటు తరుణ్ సినీ కెరిర్ పైనా తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ లో తరుణ్ పెళ్ళికి సంబంధించిన రూమర్ ఒకటి బాగా వైరల్ అవుతుంది.

అదేమిటంటే.. తరుణ్ పెళ్లి ఫిక్స్ అయ్యింది అని.. ఆ వధువు ఎవరో తెలిస్తే షాక్ అవుతారని, తరుణ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా రిచ్ అని, తరుణ్ తల్లి రోజారమణి స్నేహితురాలి కూతురుతోనే తరుణ్ కి పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారని, తరుణ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని ఈ మధ్యనే తల్లిదండ్రుల వద్దకు వచ్చిందని, ఆమె వచ్చిన తర్వాత తరుణ్ కి ఆమెకు పెళ్లి నిశ్చయం చేసినట్లుగా ఓ కథనం ప్రసారం చేసింది ఆ యూట్యూబ్ ఛానల్.. మరి ఇలాంటి ప్రచారాలకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మన యంగ్ హీరో తరుణ్ త్వరగా పెళ్లి చేసుకోవాల్సిందే.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here