Niharika: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం కమిటీ కుర్రోళ్ళు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. నిహారిక విడాకుల తర్వాత పూర్తిగా కెరియర్ పైన దృష్టి పెట్టారు. ఈమె ప్రస్తుతం నిర్మాతగాను, అలాగే నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక నిహారిక ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లను నిర్మించారు.

ఇలా వెబ్ సిరీస్ లలో మంచి సక్సెస్ అందుకున్న ఈమె మొదటిసారి కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించి ఈ సినిమా ద్వారా ఆగస్టు 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇలా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నటువంటి ఈమె సినిమా కంటే కూడా పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ వచ్చారు..
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గురించి రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. పవన్ కళ్యాణ్ బాబాయ్ గెలిచిన తర్వాత అందరికంటే ఎక్కువగా అమ్మ ఎమోషనల్ అయిందని తెలిపారు. ఇక కళ్యాణ్ గారు కోపంతో ఉన్నప్పుడు సంతోషంతో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. బాబాయ్ ఎలా ఉన్నా నన్ను నీహా అంటూ పిలుస్తారు అయినా తను నన్ను కోప్పడిన సందర్భాలు ఏవి లేవని తెలిపారు.
మొక్కను గిఫ్ట్ గా ఇచ్చారు..
ఇక పవన్ కళ్యాణ్ నుంచి మీరు అందుకున్న గిఫ్ట్ ఏదైనా ఉందా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు నిహారిక సమాధానం చెబుతూ ఓసారి రాఖీ పండుగ సందర్భంగా అఖీరాకు తాను రాఖీ కట్టాను ఆ సమయంలో బాబాయ్ నాకు ఒక మొక్క గిఫ్ట్ గా ఇచ్చారని ఇప్పటికీ ఆ మొక్క నా వద్ద చాలా భద్రంగా మంచిగా పెరుగుతోందని నిహారిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























