కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఓసీఎఫ్‌ఎస్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే.మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో ‘ఓసీఎఫ్‌ఎస్’ అనే హ్యాష్ ట్యాగ్‌ను పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ హ్యాష్ ట్యాగ్ అర్థం ఏంటో చెప్పండి అంటూ నెటిజన్లను ప్రశ్నిస్తూ పోస్టులు చేసింది నిహారిక.ఈ నేపథ్యంలోనే కొందరు నెటిజన్లు హ్యాష్ ట్యాగ్ కీ అర్థం ఇదే అంటూ వారిలో వున్న బయటపెట్టారు.

ఇక ఈ హ్యాష్ ట్యాగ్ విషయంలో చాలామంది కామెంట్లు చేయగా, అందులో కొంతమందికి నిహారిక తనదైన శైలిలోసమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే నెటిజన్ ల క్రియేటివిటీకి నిహారిక ఫిదా అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా శుక్రవారం తండ్రి నగబాబు పుట్టిన రోజును పురస్కరించుకొని నిహారిక తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను తన అభిమానులతో పంచుకుంది. ఓసీఎఫ్‌ఎస్ అంటే ఏంటో తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేసింది.
పెళ్లి తరువాత వెండి తెరకు దూరమైన నిహారిక ఇప్పుడు నిర్మాతగా బిజీగా మారేందుకు బిజీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఓసీఎఫ్‌ఎస్ అంటే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అంటూ ఆ హ్యాష్ ట్యాగ్ మీనింగ్ ను తెలియజేసింది.ఈ క్రమంలోనే జీ 5 ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్‌కు నిర్మాతగా మారింది నిహారిక. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌లో సంతోష్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితోపాటు టాలీవుడ్ సీనియర్ నటులు నరేశ్, తులసి కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికొస్తే 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉంటాయి.జీ5 ఓటీటీ వేదిక నుంచి ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ తొలి ఎపిసోడ్ ప్రీమియర్స్ నవంబరు 19న విడుదల కానుంది. ఇదిలా ఉంటే నాగబాబు పుట్టిన రోజును ఫ్యామిలీతో ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా భర్త చైతన్య, వరుణ్‌తేజ్,తన తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసిన నిహారిక కుటుంబ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది.






























