Niharika: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమాలను కాస్త పక్కన పెట్టారు. తనకు వీలున్నప్పుడు కమిట్ అయిన సినిమాలని పూర్తి చేసి పూర్తిగా రాజకీయాలకు పరిమితం అవుతున్నట్లు వెల్లడించారు.

ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ గురించి మెగా డాటర్ నిహారిక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నిహారిక ప్రస్తుతం నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే .ఈమె నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ బాబాయ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం అయినప్పటికీ మాకి మాత్రం పవర్ స్టారేనని తెలిపారు. ఎలక్షన్ కౌంటింగ్ రోజు మేమంతా టీవీ ముందే కూర్చుని ఉన్నామని తెలిపారు. ఇక మా అమ్మ అయితే చాలా ఎమోషనల్ అయిందని తెలిపారు.
KKK….
ఇక పవన్ కళ్యాణ్ బాబాయ్ పొలిటికల్ స్పీచ్ తనని చాలా మోటివేట్ చేస్తాయని నాకు చాలా ఇష్టం అని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ బాబాయ్ ఫోన్ నెంబర్ తన ఫోన్ లో KKK అని సేవ్ చేసి ఉన్నట్లు తెలిపారు. KKK అనగా కొణిదెల కళ్యాణ్ కుమార్ అని,అది పవన్ కళ్యాణ్ పూర్తి పేరనీ ఈ సందర్భంగా నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























