Niharika -Lavanya Tripati: పార్టీలో చిల్ అవుతున్న వదిన మరదలు… వైరల్ అవుతున్న నిహారిక లావణ్య ఫోటో!

0
26

Niharika -Lavanya Tripati: మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు.విడాకులు తీసుకున్నాము అన్న ఆలోచన బాధ కూడా లేకుండా ఈమె కుటుంబ సభ్యులతో స్నేహితులతోనూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నిహారిక వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈమె తన కాబోయే వదిన నటి లావణ్య త్రిపాఠితో కలిసి పార్టీకి వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసినటువంటి పలువురు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలను నిహారిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ లవ్లీ వేదర్, ఫేవరెట్ పీపుల్ కలిస్తే బ్యూటిఫుల్ ఈవినింగ్ అవుతుందని ఫోటోలను షేర్ చేశారు.

ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది వదిన మరదల మధ్య అండర్ స్టాండింగ్ ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే లావణ్య త్రిపాటి నిహారిక మాత్రమే కాకుండా వరుణ్ తేజ్ కూడా ఈ పార్టీలో ఉన్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా లావణ్య ఫోటోని షేర్ చేయగా లావణ్య త్రిపాఠి ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా వరుణ్ తేజ్ ఫోటోలను షేర్ చేశారు.

Niharika -Lavanya Tripati: పార్టీలో చిల్ అవుతున్న మెగా కపుల్స్…


ఇలా ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో ఈ ముగ్గురు కలిసి పార్టీకి వెళ్లారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గత నెల తొమ్మిదవ తేదీ వరుణ్ తేజ్ లావణ్య త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక వీరిద్దరూ మిస్టర్ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.