Niharika: పుష్ప 2 లో కీలక పాత్రలో నటించనున్న మెగా డాటర్ నిహారిక… వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!

0
70

Niharika: మెగా డాటర్ నిహారిక పరిచయం అవసరం లేని పేరు గత కొద్ది రోజులుగా ఈమె తన వ్యక్తిగత విషయాలు వల్ల పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. 2020 వ సంవత్సరంలో జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్నటువంటి నిహారిక ప్రస్తుతం తనతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందనీ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఇలా నిహారిక విడాకుల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ఈ వార్తలను మెగా ఫ్యామిలీ ఏ మాత్రం ఖండించలేదు అయితే తన వ్యక్తిగత విషయం గురించి ఎలాంటి వార్తలు వచ్చిన తాను ఏ మాత్రం పట్టించుకోకుండా తన వృత్తిపరమైన జీవితంలో నిహారిక ఎంతో బిజీగా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు వెబ్ సిరీస్లను నిర్మించడమే కాకుండా తాను కూడా తిరిగి సినిమాలలోకి రావడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే పలు సినిమాలలో నిహారిక నటించడానికి సిద్ధమయ్యారని సమాచారం.తాజాగా అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2. ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా గురించి తాజాగా ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Niharika: గిరిజన యువతి పాత్రలో…


ఈ సినిమాలో మెగా డాటర్ నిహారిక ఒక గిరిజన యువతి పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఇక ఈమె పాత్ర సినిమాకు చాలా కీలకంగా మారబోతుందని తెలుస్తోంది.ఇలా నిహారిక గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే గతంలో ఈ పాత్రలో సాయి పల్లవి నటించబోతున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి.