Niharika: మెగా డాటర్ నిహారిక పరిచయం అవసరం లేని పేరు నాగబాబు కుమార్తెగా బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన నిహారిక తన మాటతీరుతో బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. ఇలా బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూనే ఈమె వెండితెరపై హీరోయిన్ గా సందడి చేశారు. నిహారిక పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమెకు పెద్దగా ఆదరణ రాలేదని చెప్పాలి.

నిహారిక ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్న ఈమెకు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె పెద్దలు చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు.ఇలా నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. అయితే సినిమాలపై ఉన్న పిచ్చి తగ్గకపోవడంతో ఈమె హీరోయిన్గా కాకుండా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఈ విధంగా నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి పలు వెబ్ సిరీస్ లను నిర్మించారు.ఇలా నిర్మాతగా వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ సక్సెస్ అయినటువంటి నిహారిక తాజాగా హైదరాబాద్లో ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేశారు.ఇలా ఈమే నిర్మాతగా కొనసాగుతూ ఉండగా అసలు నిహారిక ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ నిర్మాతగా స్థిరపడ్డారు. అయితే ఇండస్ట్రీలో కొనసాగుతూ ఈమె ఎంత మొత్తంలో డబ్బు సంపాదించారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Niharika: భారీగా సంపాదించిన నిహారిక…
ఈ క్రమంలోనే నిహారిక ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగానే ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం 2020 సంవత్సరం నాటికి సుమారుగా ఈమె 35 కోట్లకు పైగా ఆస్తులను కూడా పెట్టారని తెలుస్తోంది. ఇలా నిహారిక స్వతగహ సంపాదించిన ఆస్తులు విలువ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈమె పెళ్లి చేసుకున్న వెంకట చైతన్య కూడా భారీగానే ఆస్తులు ఉన్నాయని కొన్ని వేలకోట్లకు అధిపతి అని తెలుస్తుంది. అయితే నిహారిక వెంకట చైతన్య మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు వచ్చాయని విడాకులు కూడా తీసుకోబోతున్నారని తెలుస్తోంది మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.































