Niharika: మెగా డాటర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిహారిక గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత కారణాలవల్ల వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈమె 2020వ సంవత్సరంలో వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తర్వాత కొంతకాలం పాటు వీరిద్దరూ సంతోషంగా ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా ప్రస్తుతం ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇలా వీరిద్దరూ గత కొద్దిరోజులుగా దూరంగా ఉండటమే కాకుండా ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడం అలాగే పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడం జరిగింది.ఇక ఈ మధ్యకాలంలో నిహారిక ఎక్కడికి వెళ్ళినా స్నేహితులతో పాటు వెళుతుంది. ఎక్కడ కూడా తన భర్తతో కలిసిన సందర్భాలు లేవు.
నిహారిక హైదరాబాద్లో నిర్మాణ సమస్త కోసం ఆఫీసు ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పూజా కార్యక్రమాలకు కూడా తన భర్త హాజరు కాలేదు.ఇలా ఈ విషయాలన్నీ కూడా వీరిద్దరు విడాకులు తీసుకున్నారు అనడానికి బలమైన కారణాలుగా కనపడుతున్నాయి. అయితే తాజాగా మరోసారి జొన్నలగడ్డ వెంకట్ చైతన్య నిహారికతో విడాకులు తీసుకున్నానని చెప్పకనే చెప్పేశారు.

Niharika: తిరుపతిలో కనిపించని నిహారిక…
జొన్నలగడ్డ వెంకట చైతన్య కుటుంబ సభ్యులందరూ కూడా తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఇలా కుటుంబ సభ్యులందరూ ఉన్నప్పటికీ నిహారిక మాత్రం ఇక్కడ కనిపించకపోవడంతో నిహారికకు విడాకులు ఇవ్వడం వల్లే వారి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి రాలేదని అందరూ ఓ క్లారిటీకి వచ్చేసారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.